రాష్ట్రంలో ప్రగతి సున్నా. ఆలయాలపై దాడులు, వైసీపీ నేతల అరుపులు, అధ్వాన రోడ్లు తప్ప ఏమున్నాయి? ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా స్పందిస్తాను.
థియేటర్లు రేట్లు తగ్గించారు. ఆలయాలు, ప్రసాదాలు, కరెంటు ఛార్జీలు పెంచి సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తారా? ఎవరో కష్టార్జితంపై మీ పెత్తనం ఏంటి?
‘నాకేమన్నా థియేటర్లు ఉన్నాయా..? మీ వైసీపీ నేతలకే ఉన్నాయి. కాకినాడ, నెల్లూరుల్లో థియేటర్లు ఎవరివి మీ వారివి కావా..? సినిమా టిక్కెట్లు ఎంతైనా పెట్టుకోని చావండి.. నాకేం అభ్యంతరం లేదు. మా కష్టార్జితంపై మీ పెత్తనం ఏంటీ..? అన్నది నేను ప్రశ్నించా.
మీకంతగా జనానికి సేవ చేయాలనుంటే మరి జనం ఇళ్లు కట్టుకోవడానికి భారతీ సిమెంట్ ను పంచండి. ఇపుడు టిక్కెట్లపై పడ్డారు. ఇంకా చాలదేమో. ఓ పని చేయండి.. ఇళ్లల్లోకి వచ్చి మా బంగారాన్ని లాగేసుకోండి అని విమర్శించారు పవన్.
అంటూ పవన్ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రాబోతోంది.. వైసీపీకి ఛాలెంజ్ చేస్తున్నా.. మీరా..? మేమా..? తేల్చుకుందాం రండి అన్న పవన్… మీరు ఏం చేశారో అన్నీ గుర్తుపెట్టుకుంటాం.. చర్యకు ప్రతి చర్య తప్పదు అని వార్నింగ్ ఇచ్చారు.