అందరికీ ‘మాతృ దినోత్సవ’ శుభాకాంక్షలు..!
‘తానా’ ఎన్నికల్లో బాలట్లు గత నాలుగైదు రోజులుగా ఇళ్లకు చేరుతుండగా యదావిధిగా ఇళ్ళ దగ్గర కు వెళ్లి రక రకాల ఒత్తిడిలతో బాలట్లు దండు కెళ్ళే ప్రయత్నాలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఇంకా ముందుకు వెళ్లి పోస్ట్ బాక్సల నుంచి ఇంటి ఓనర్ కి కూడా తెలియకుండా ఎత్తుకు పోయే ప్రయత్నాలు కూడా జరిగినట్లు తెలియ వచ్చింది. రెండు వర్గాలు ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నందున గెలుపోటములు సవాలుగా తీసుకొని ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ పోటీ అభ్యర్థి శ్రీనివాస గోగినేని గత కొద్ది నెలలుగా వర్గాలకు వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా అక్రమమైన బాలట్ కలెక్షన్ విధానానికి వ్యతిరేకంగా సాగించిన ఉధృతమైన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లి మరియు మహమ్మారి దెబ్బకు తమ బాలట్లును ఇవ్వడానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరుస్తుండటం అమెరికా వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మొదటి రోజు తమకు అతి దగ్గరి వారి వద్ద మొదలు పెట్టిన బాలట్ కలెక్షన్ లు ఆశాజనకంగా అనిపించినప్పటికీ,రెండో మూడో రోజుకే సాధారణ సభ్యులనుండి వ్యక్తమవుతున్న ప్రతిఘటన చూసి ఖంగుతిన్నారు. ఇంకా రోజు రోజుకీ మరింత జఠిలమవుతున్నట్లు తెలియవస్తోంది.
పోలయ్యే ఓట్లలో 50 శాతం పైగా కలెక్ట్ చేసే టార్గెట్ తో మొదలైన బాలట్ కవర్ కలెక్షన్ రోజు రోజుకీ మందగిస్తుండడంతో ఎన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయి నాయకులే రంగంలోకి దిగి బాలట్ కలెక్షన్ చేస్తూ, చేయిస్తూ వచ్చిన వాటిని తమ సంరక్షణ లోనే ఉంచుకోవడం కనీ వినీ ఎరగని మధ్య స్థాయి నాయకులు ముక్కున వేలు వేసుకుంటున్నారు. అయినప్పటికీ కొంతమంది ఆల్రెడీ కొన్ని స్థానాలకు ఓటు మార్క్ చేసి ఇవ్వడం, మరికొంత మంది సీల్ కూడా వేసి పోస్ట్ మాత్రమే చేయడానికి ఇవ్వడం దేనికి సంకేతమో అర్ధం కావడం లేదు. పైగా కొన్ని చోట్ల చెదురు మొదురుగా పోస్టల్ బాక్స్ ల నుండి దొంగతనం జరిగినట్లుగా రిపోర్టులు రావడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అదే అదునుగా తీసుకుని కొంత మంది తమ బాలట్ రాలేదని ఎవరో ఎత్తుకు పోయారని పైకి చెప్తూ, తమ ఓట్లు గుంభనగా పంపేసి తప్పుకుంటున్నారు. కొన్ని చోట్ల మహిళలు ఈ సారి శ్రీనివాస గోగినేనికి వేయాల్సిందే అని, ఒప్పుకోక పోతే తమ ఒక్క ఓటు వరకు ఆయనకు వేయడం కూడా అనేక చోట్ల జరిగినట్లు తెలియవచ్చింది. ఇంకా ఒక వర్గానికి వేస్తే ఇంకో వర్గంతో వైరం, చివరికి వారిద్దరూ ఒక్కటై తమను పిచ్చివారిని చేసిన ఆశ్చర్యం లేదని కొందరు, మహమ్మారి సమయంలో రిస్క్ అని కొన్ని చోట్ల బాలట్స్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు.
పూర్వం ఇనప్పెట్టెల్లో డబ్బుల్ని షావుకారు రోజూ బయటకు తీసి ఒకటికి రెండు సార్లు లెక్క పెట్టుకున్నట్లు, వర్గ నాయకులు బాలట్ కవర్లు రోజూ చాలా సార్లు లెక్క పెట్టుకోవడం చూసి అనుయాయులు నవ్వుకొంటూ, ఎన్ని సార్లు లెక్క పెట్టిన నంబరు మారదని తెలియదనుకుంటా అంటున్నారు. ఇక ఫేక్ ప్రచారానికైతే తావు లేదు, మనకు మిగతా అన్నిచోట్లా బ్రహ్మాండంగా ఉంది మనం కూడా ఇరగదీయాలని ఒకళ్ళని ఒకళ్ళు ఉత్సాహపరుస్తూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఒకటో రెండో చోట్ల తప్ప మిగతా చోట్ల కలెక్షన్ తక్కువేనని కూడా చెవులు కొరుక్కుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమ వర్గం కంటే వేరే వర్గం ఎన్ని కలెక్ట్ చేసుకుంటుందో అని కూపీ లాగుతుంటే వారిని మానసికంగా దెబ్బ తీయటానికి మూడు రెట్లు ఎక్కువగా చెప్తూ, వర్గ నాయకులు గాడ్ ఫాథర్స్ మాత్రం అంతర్గతంగా తీవ్ర నిరాశకు లోనవుతూ తమ బాలట్ కలెక్టర్లను ఒత్తిడి చేస్తున్నారు. రెండు వర్గాల నాయకులూ తమ అంతర్గత సంభాషణల్లో బాలట్స్ చేతికి ఆశించినంతగా రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ముఖ్య కారణంగా గోగినేని ప్రచారం మరియు మహమ్మారి దెబ్బ అని బాధపడుతూనే తమ కంటే అవతలి వర్గం ఇంకా దెబ్బతిందని సమాధాన పర్చుకొంటున్నారు. ఇంకో విషయమేమిటంటే ‘తానా’ బాలట్స్ పై “కాన్ఫిడెన్షియల్ : ‘తానా’ బాలట్స్” అని ఉండటం వలన మెయిల్ బాక్స్ నకు ఇంటి పేరు మ్యాచ్ అయితేనే డెలివరీ చేయటం వలన చాల బాలట్స్ వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది, ఇది అడ్రస్ ‘చేంజ్’ లు ఎక్కువగా చేసిన ‘చేంజ్ ప్యానెల్’ కు ఎక్కువగాను, అలాగే ఇంతకు ముందు అడ్రస్ మానిప్యులేషన్ వ్యవహారాలున్న ఇంక్లూసివ్ ప్యానెల్ కు కూడా బాగానే దెబ్బ తగిలినట్లు గా అనుకుంటున్నారు.
అయితే క్షేత్ర స్థాయిలో ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ విధంగా ఉంది. డి సి ఏరియా లో ఇంక్లూసివ్ ప్యానెల్ కు పోస్టల్ దొంగతనం చేసిందని చేంజ్ ప్యానెల్ ఆరోపణలు గుప్పిస్తుండగా, నిజానికి రెండు పానెల్స్ కలెక్షన్స్ కు తీవ్ర ప్రయత్నాలు చేశారు, సహజంగానే ఇంక్లూసివ్ ప్యానెల్, చేంజ్ ప్యానెల్ కంటే చాలా అధికంగా చేసినప్పటికీ, అనుకున్న దానికంటే తక్కువేనని తెలుస్తోంది. అలాగే బే ఏరియా, ఫిలడెల్ఫియా ల్లో కూడా ఇంక్లూసివ్ ప్యానెల్ తక్కువస్థాయిలోనే అయినప్పటికీ చేంజ్ వర్గం కంటే ఆధిక్యంలో ఉండగా, అందరూ అనుకుంటున్నట్లు అట్లాంటా, న్యూయార్క్, ఇల్లినాయిస్ ఏరియాల్లో అనుకున్న దానికంటే తక్కువ అయినా చేంజ్ ప్యానెల్ కలెక్షన్ కొంత ఆధిక్యంలో ఉంది. కాగా మిచిగాన్, టెక్సాస్, ఒహయో, న్యూ జెర్సీ, కరోలినా వంటి చోట్ల తక్కువ స్థాయి లోనే అయినా కలెక్షన్ నంబర్లు రీత్యా పోటా పోటీ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఊహించని విధంగా న్యూ ఇంగ్లాండ్ ఏరియా తో పాటు అనేక ఇతర చోట్ల కలెక్టన్లు మరీ తక్కువ స్థాయిలో నమోదయ్యాయి. ముఖ్యంగా ఏదో ఒక వర్గం మరీ ఆధిక్యంలో ఉంటుందనుకుంటున్న డి సి ఏరియా, బే ఏరియా, అట్లాంటా, న్యూ యార్క్ వంటి చోట్ల కూడా మోతాదు తగ్గడంతో పాటు ఒకే వర్గం భారీ ఆధిక్యం చూపించడంలో విఫలం కావడంతో, ఏ వర్గం గ్యారంటీగా గెలిచే నమ్మకం పొందలేక పోవడం తో పాటు, ప్రెసిడెంట్ పదవికి గోగినేని కూడా ఫేవరెట్ గాను, బాలట్ కలెక్షన్ తగ్గి పోవడానికి ముఖ్య కారకుడిగాను నిలవడం కారణంగా తుది ఫలితాలపై ఆసక్తి రేపుతోంది. ఇక శక్తి యుక్తులను అత్యధిక స్థాయిలో పెట్టిన వర్గాల నాయకులకు దడ పుట్టిస్తూ, తుది ఫలితం ఏమవుతుందోనని ఆందోళన పడటం అనిశ్చితికి ముఖ్య కారణం.
ఎలక్షన్ కమిషన్ లో లుకలుకలు: ఇక ఎన్నికల ప్రచారం ఒక రకంగా ఉంటే ఎలక్షన్ కమిషన్ లో ఉన్న పెద్దల మధ్య కూడా కొన్ని విషయాలపై బేధాభిప్రాయాలు అన్నట్లు తెలియడం మరీ ఆశ్చర్యం. ముఖ్యంగా ‘తానా’ లిస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత కూడా అడ్రస్ చేంజ్ చేసిన వ్యవహారంపై, వ్యవహరించే సందర్భంగా వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు , అలాగే బోర్డు తో మాట్లాడినప్పుడు, బోర్డు నియమించిన సబ్ కమిటీ నివేదిక సమయంలో కూడా కొంత తర్జన భర్జనలు పడినట్లు తెలుస్తోంది. ఏదేమైనా సబ్ కమిటీ రిపోర్ట్ ఒక అభ్యర్థి పై ఇబ్బందికర నివేదిక ఇవ్వవచ్చునని ఊహాగానాలు ఒకవైపు కొనసాగుతుండగా, ఒక ఎలక్షన్ కమిటీ సభ్యుడి భార్య, అలాగే ‘తానా’ కు ఉన్న ఒకే ఒక మహిళా మాజీ అద్యక్షురాలు హుందాను మరచి బహిరంగంగా ఒక ప్యానెల్ కు మద్దతుగా భారీ స్థాయి ప్రచారం లో పాల్గొనడమే కాక, కొంత బాలట్ కలెక్షన్ లో కూడా పాల్గొంటున్నారని ఆరోపణలు ఆవిడకు, ఎలక్షన్ కమిషన్ ప్రొటొకాల్ కు, అలాగే ‘తానా’ కు తలవంపులుగా భావిస్తున్నారు. అలాగే ఒక మాజీ అధ్యక్షులు, ప్రస్తుత బోర్డు సభ్యుడు అయిన ఒకరి భార్య కూడా బహిరంగంగా ఒక ప్యానెల్ కు, లోకల్ పోటీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనడం పైన విమర్శలు చెలరేగుతున్నాయి. ఇంకా కొద్దిమంది వృద్ద నాయకులు మేమున్నామంటూ ఎండోర్సెమెంట్స్ చేయడం కూడా ఒత్తిడులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుపుతుంది. వెరసి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వర్గం, ఏ వర్గ నాయకుడూ, ఏ గాడ్ ఫాదర్ కూడా సంతృప్తి లేకపోవడం ఒక ఎత్తైతే తన విధానాలకు ఒక్కడిగానే అత్యంత ప్రాచుర్యం, గుర్తింపు తెచ్చుకోవడం పై ఆల్రెడీ పాక్షిక విజయంతో, తుది విజయానికి కూడా శ్రీనివాస గోగినేని ముఖ్య పోటీదారునిగా నిలబడగలడంపై అందరి ఆసక్తి కేంద్రీకృతమై ఉంది. చివరికి ఏమి జరిగినా, ప్రస్తుతానికి జరుగుతొంది ఇదే.