• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రాణ ప్రతిష్టోత్సవం

NA bureau by NA bureau
May 9, 2021
in NRI, Trending, Uncategorized
0
న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రాణ ప్రతిష్టోత్సవం
0
SHARES
328
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఎడిసన్: మే 8:: అమెరికాలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవానికి ఇది నాంది..న్యూజెర్సీలో హిందు ప్రాభవాన్ని కొనసాగించేందుకు షిర్డీ ఇన్ అమెరికా – శ్రీ సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో శ్రీ హేరంబ గణపతి, పంచముఖ శివ, కామాక్షీ అమ్మవారు, శ్రీ వేంకటేశ్వర స్వామి, మురుగన్ , హనుమాన్, అయ్యప్పస్వామి, నవగ్రహ దేవత సహిత ఉత్సవ దేవతా మూర్తి, వాసవీ కన్యకాపరమేశ్వరీ,  షిరిడీ సాయిబాబా మరియు, దత్త పరంపర సన్నిధి సహితంగా, న్యూ జెర్సీ రాష్ట్ర నడిబొడ్డు ఎడిసన్ నగరం లోని ఓక్ ట్రీ రోడ్ లో శ్రీ శివ విష్ణు ఆలయం గా ఆవిర్భవించింది. ఈ ఆలయ ప్రారంభం ఆగమ శాస్త్రోక్తయుక్తంగా, అంగ రంగ వైభవంగా న్యూజెర్సీ సాయి దత్త పీఠం నిర్మించిన శ్రీ శివ విష్ణు ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కోవిడ్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు. ఈ ప్రాణ ప్రతిష్టోత్సవ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ జై స్వరాజ్ టీవీ వారి ద్వారా వీక్షించేలా సాయి దత్త పీఠం ఏర్పాట్లు చేసింది. సౌత్ ప్లైన్ ఫీల్డ్ లో తాత్కాలిక ఆవాసంలో ఉన్న సాయి దత్త పీఠం ఇప్పుడు భక్తులకు మరింత చేరువయ్యేందుకు ఎడిసన్‌లో సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరాన్ని నిర్మించింది. ఇక  ప్రధాన సేవలన్నీ ఎడిసన్ లోని సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరం నుంచే జరగనున్నాయి. న్యూజెర్సీలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరాన్ని సకల దేవతల సమాహారంగా తీర్చిదిద్దింది. వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా ఈ దేవతల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించింది. పరిమిత సమయాలలో  ముందుగా మందిరానికి ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్న వారికి,  కోవిడ్ నిబంధనులు  పాటిస్తూ నూతనంగా నిర్మించిన ఈ శ్రీ శివ, విష్ణు ఆలయాన్ని భక్తులు సందర్శించవచ్చని సాయి దత్త పీఠం నిర్వాహకులు ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి తెలిపారు.
ఈ సందర్భంగా రఘుశర్మ, భైరవ మూర్తి, మురళీ కృష్ణ శర్మ, మహంకాళీ రామకృష్ణ, సూరి కృష్ణ శర్మ ల తో పాటు, సాయి దత్త పీఠం పురోహితులు అందరూ కరోనా మహమ్మారి త్వరగా తొలగిపోయి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక హోమాలు నిర్వహించారు. లోక కళ్యాణార్ధం జరిగిన హోమాది కార్యక్రమాలలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
గత 7 రోజులుగా జరుగుతున్న ఈ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ముగింపు సందర్భంగా  ఈ రోజు శివ పార్వతుల కళ్యాణం తో దేవాలయ ప్రాంగణం భక్తుల తో కళ కళ లాడింది.
శ్రీ శివ విష్ణు మందిరం ఆలయ నిర్మాణ కార్యక్రమాల్లో  ఉపేంద్ర చివుకుల సలహాలతో, సురేష్ జిల్లా గత 2 సంవత్సరాలుగా ఆలయం వద్దే ఉంటూ తన వంతు బాధ్యతగా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రఘుశర్మ ఆలయ విగ్రహాలను చేసిన  స్తపతులను గుర్తు చేసుకున్నారు. పంచముఖ గణపతి స్థపతి మహా బలిపురం సుధాకరశర్మను, తిరుపతి బాలాజీ విగ్రహ సృష్టికర్త ప్రభు స్వామిని, బాబా విగ్రహ సృష్టి కర్త రాజస్థాన్ ముఖేష్ భరద్వాజ్ ను, ఆలయం విగ్రహ ప్రతిష్ఠ సందర్భముగా క్రేన్ సహాయంతో   సాయి భక్తుడు, రఘు శర్మ చే సాయి దత్త పీఠ ఆలయ స్థపతి గా గుర్తించబడిన  రంగా బోను, తన మిత్ర బృంద సహకారం తో ఎంతో నేర్పుతో మందిర ఏర్పాటు లో ఎంతో  తోడ్పాటు అందించారు.
ప్రస్తుతం ఇంకా షిప్మెంట్ లో ఉన్న వేంకటేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారు, వాసవీ కన్యకాపరమేశ్వరీ, మురుగన్, దత్త పరంపర విగ్రహాలు ఇంకా షిప్మెంట్ లో ఉన్న విగ్రహాల ప్రతిష్ఠ జూన్ నెలలో జరుగనుందని రఘు శర్మ తెలియచేసారు.
తానా అధ్యక్షుడు జె తాళ్లూరి, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్, ఎక్స్ ప్రెసిడెంట్  మోహన్ కృష్ణ మన్నవ, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీ హరి మందాడి, టి పి  రావ్,  టి ఎఫ్ ఏ ఎస్ అధ్యక్షులు శ్రీదేవి జాగర్లమూడి, శ్రీనివాస్ గనగోని, సుధాకర్ ఉప్పల, ఈ ఆలయ ప్లాటినమ్ స్పాన్సర్,  సంఘ సేవకులు జగదీష్ యలమంచిలి తదితరులు విచ్చేసారు.
ఓం సాయి బాలాజీ వ్యవస్థాపకులు మద్దుల సూర్యనారాయణ, పోమోనో రంగనాధ ఆలయ ప్రతినిధులు, గురువాయూరప్పన్ ఆలయ ప్రతినిధులు విచ్చేసి మందిర నిర్మాణాన్ని ప్రత్యేకంగా అభినందించాల.
ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుండి, కెనడా నుండి ఎందరో సాయి భక్తులు విచ్చేసారు.  ప్రముఖ గాయని ఉష తన గాన మాధుర్యం తో గంటకు  పైగా భక్తి గాన ప్రవాహం లో భక్తులను ఓలలాడించారు.
రఘుశర్మ మాట్లాడుతూ, మందిర నిర్మాణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ప్రతీ వాలంటీర్ గ్రూప్ ను, స్టాఫ్, డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ 7 రోజులూ నిత్యాన్నదానం జరిగింది. మీడియా పరంగా సహకరించిన ప్రతీ ఛానల్ వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.

Tags: siva vishnu temple in NJ
Previous Post

బ్రేకింగ్: మంత్రి అప్పలరాజుపై కేసు… అందుకే చంద్రబాబుకు నోటీసులివ్వలేదా?

Next Post

‘తానా’ ఎన్నికల ఫలితాల లో అనిశ్చితి

Related Posts

జగన్ లండన్ జర్నీ చాలా కాస్ట్లీ గురూ…ఎంత తగలేశారో తెలుసా?
Andhra

జగన్ లండన్ జర్నీ చాలా కాస్ట్లీ గురూ…ఎంత తగలేశారో తెలుసా?

May 21, 2022
లండన్ లో జగన్ ‘మనీ’ ల్యాండింగ్?…ఏకిపారేసిన యనమల
Andhra

లండన్ లో జగన్ ‘మనీ’ ల్యాండింగ్?…ఏకిపారేసిన యనమల

May 21, 2022
కార్యకర్తలకు చంద్రబాబు వార్నింగ్…చర్యలు తప్పవట
Andhra

కార్యకర్తలకు చంద్రబాబు వార్నింగ్…చర్యలు తప్పవట

May 21, 2022
రాజ్య సభ సీటు రేటుపై వైసీపీ ఎంపీ ‘బీద’ పలుకులు
Andhra

రాజ్య సభ సీటు రేటుపై వైసీపీ ఎంపీ ‘బీద’ పలుకులు

May 21, 2022
రాయలసీమ లో బాబుకు బ్రహ్మరథం!!
Andhra

రాయలసీమ లో బాబుకు బ్రహ్మరథం!!

May 20, 2022
NRI TDP USA-బోస్ట‌న్ మ‌హానాడుకు స‌ర్వం సిద్దం!
NRI

NRI TDP USA-బోస్ట‌న్ మ‌హానాడుకు స‌ర్వం సిద్దం!

May 20, 2022
Load More
Next Post
TANA

'తానా' ఎన్నికల ఫలితాల లో అనిశ్చితి

Please login to join discussion

Latest News

  • ఫేక్ కలెక్షన్లు నిజమేనంటోన్న స్టార్ ప్రొడ్యూసర్?
  • జగన్ ఎవరి దత్తపుత్రుడో చెప్పిన సీపీఐ నారాయణ
  • జగన్ లండన్ జర్నీ చాలా కాస్ట్లీ గురూ…ఎంత తగలేశారో తెలుసా?
  • మ‌ళ్లీ త‌డ‌బ‌డిన ప‌వ‌న్‌.. ఇలా అయితే ఎలా సామీ..!
  • ఫిల్మ్ ఫెస్టివల్లో మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌.. రీజ‌న్ ఇదేనా?
  • అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడంటే…
  • లండన్ లో జగన్ ‘మనీ’ ల్యాండింగ్?…ఏకిపారేసిన యనమల
  • సిక్కోలు కోటలో సింగంలా లోకేశ్…రెస్పాన్స్ అదిరింది
  • ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి: బాల‌య్య మెసేజ్ ఇదే!
  • కార్యకర్తలకు చంద్రబాబు వార్నింగ్…చర్యలు తప్పవట
  • రాజ్య సభ సీటు రేటుపై వైసీపీ ఎంపీ ‘బీద’ పలుకులు
  • రాయలసీమ లో బాబుకు బ్రహ్మరథం!!
  • NRI TDP USA-బోస్ట‌న్ మ‌హానాడుకు స‌ర్వం సిద్దం!
  • ఇక కేసీఆర్ పై పవన్ ‘యాక్షన్’షురూ…ఆయనే డైరెక్టర్
  • ఆ మల్లెపూలేయ్…మంత్రులపై అయ్యన్న సెటైర్లు వైరల్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds