• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎట్టకేలకు ‘తానా’ ఎన్నికల బాలట్స్ పోస్టింగ్

'బాలట్ కవర్ కలెక్టర్ల' పై నిఘా కళ్ళు 

admin by admin
May 2, 2021
in TANA Elections, Trending
0
TANA
0
SHARES
351
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఓటర్ల బాధ్యత: “నిగ్గ  తీసి అడుగు ఈ సిగ్గులేని బాలట్ కలెక్టర్లను, లాగి ఒక్కటివ్వు ఇంకా తగులుకుంటే, అగ్నితోటి కడుగు ఈ ‘తానా’ సంస్థ మురికిని, మారాలి ఈ నాయకులు, మారాలి ‘తానా’ ఓటర్లు, మారాలి మన ‘తానా’, ఆవిష్కరించాలి మళ్లీ గర్వపడే కొత్త ‘తానా'”

అనేక మలుపులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, తంత్రాలు, కుతంత్రాలు, బుజ్జగింపులు, బెదిరింపులు, మీటింగులు మీద మీటింగులు, ట్రోలింగుల మీద ట్రోలింగులు, కప్పదాట్లు, అడ్రస్ మార్పుల బాగోతాలు, లీగల్ ఛాలెంజీలు, టీవీ ఛానల్ ముఖాముఖీలు, ఫేస్బుక్ పోస్టింగులు, వాట్సాప్ మెసేజీలు, ఎం ఎం స్ లు, ఫోన్ కాల్స్, హ్యూమన్ ఆబ్లిగేషన్ లు, వ్యాపార కనెక్షన్లు, రాజకీయ అనుబంధాలు, కమిటీ పదవులు ఇంకా ఇతర పదవుల ఆశలు ఎన్నో ఇంకెన్నెన్నో మధ్య చిట్ట చివరి ఘట్టం రానే వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ‘తానా’ బాలట్ లు ఏప్రిల్  30  శుక్రవారం సాయంత్రం సియాటెల్ నగరం నుంచి పోస్ట్ అయ్యాయి. అక్కడినుంచి దూరాన్ని బట్టి మే మొదటి వారంలో ఓటర్ల ఇళ్లకు చేరతాయి. మే 28 లోపు వచ్చిన బాలట్లను  లెక్కించి తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు తేలుతాయి.

అయితే ఇప్పటి వరకు బహిరంగంగా జరిగిన వ్యవహారాలు క్రమ క్రమంగా చీకటిలోకి మారుతున్నట్టు తెలియవస్తోంది. ఇప్పటి వరకు ఒకవైపున తిరుగుతున్నవారు అకస్మాత్తుగా సైలెంట్ కావడానికి ఇంకొంత మంది ఏకంగా సరిహద్దు దూకడానికి సిద్ధమవటం మానసికంగా ఇబ్బంది పెడుతోంది. అలాగే ఒక వారం పాటు అడ్రస్ చేంజ్ ల వ్యవహారం పై అమెరికా వ్యాప్తంగా జరిగిన రచ్చ, 7 గంటలపైగా ‘తానా’ బోర్డ్ లో చర్చ జరిగిన తర్వాత కూడా కొండను తవ్వి ఎలకను పట్టడానికి అన్నట్టు ఓ ముగ్గురు మహా వేటగాళ్లతో కమిటీ ప్రహసనం అపహాస్యం పాలయింది. ఇక చివరి అస్త్రంగా తమకు అత్యంత బలమైనదిగా భావిస్తున్న బాలట్ కలెక్షన్ ప్రక్రియను క్రియాశీలకంగా చేయడానికి అన్ని ప్రయత్నాలు ముసుగులో మొదలవ్వగా ఆశ్చర్యకరమైన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక వారం క్రితం కూడా అంతా బాగానే ఉంది అనుకుంటున్నది బాలట్ పోస్టింగ్ లో వచ్చిన చిన్న బ్రేక్ తర్వాత అకస్మాత్తుగా ఏదో తేడాగా ఉంది అని రెండూ వర్గాలు అనుకుంటున్న పరిస్థితిలో స్మశాన నిశ్శబ్దం అంతటా అలముకుంది. దీనికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి ఉచ్చ స్థాయిలో జరిగిన ప్రచారానికి అడ్రస్ చేంజ్ వ్యవహారం ఒక స్పీడ్  బ్రేకర్ గా అడ్డుపడి తిరిగి స్పీడ్ అందుకోక పోవడం, ఈ మధ్యలో ఇండియా లో కోవిద్ మహమ్మారి పతాక స్థాయికి చేరి అందరిలో ఒక ఉద్విగ్న పరిస్థితిని కలిగించడంతో పాటు, ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీనివాస గోగినేని ప్రభావవంతంగా వర్గాల కుంపట్ల గురించి బాలట్ కలెక్టర్ల  ఆగడాల గురించి సాధారణ సభ్యులకు అవగాహన కలగించడంలో సఫలీకృతుడవ్వడం కారణాలుగా చెప్పవచ్చును.

ఒక్కసారి ఈ వర్గాల హడావుడిని సమీక్షిద్దాం

నరేన్ కొడాలి: జాక్ అండ్ జిల్ వెంట్ అప్ అండ్ డౌన్ ది హిల్ మెనీ టైమ్స్
నీరసంగా వేమన శతకం తో లేటుగా మొదలై, పడుతూ లేస్తూ, అనుకోకుండా ఫుల్ గా కమిటైపోయిన పెద్దాయన తప్పని పరిస్థితుల్లో అరిగిపోయిన బూట్లను మార్చుకొంటూ తన వెంటనే తిరుగాడగా, తెలుగు- సంస్కృత-ఇంగ్లీషు భాషల్లో వెనుక పెద్ద సౌండ్ తో వేసిన బ్యాక్ గ్రౌండ్  మ్యూజిక్ లో కలిపి కొట్టిన సంభాషణలకు సగం అర్ధమై, సగం అర్థం కాక పోయినా మొత్తానికి ఒక రసవత్తరమైన పోటీగా వర్గాన్ని నిలపడంతో సఫలీకృతుడైనట్లే.
బలాలు: విద్యాధికుడని, చాల కాలంగా ‘తానా’ సేవకుడని బిల్డ్ అప్ తో పాటు పెద్ద మనిషి అనే గుర్తింపు తోడవగా నిజమేననిపించే తెల్ల గడ్డం, రెండు దశాబ్దాలుగా ‘తానా’ ను గుప్పిట్లో ఉంచుకొంటూ విమర్శలెన్ని ఎదురైనా ఇప్పటి వరకు ఓటమి లేని ముగ్గురు మరాఠీల దన్ను తో పాటు, కొంత స్వంత స్నేహితులు, విద్యార్థుల తోడ్పాటు. ప్రత్యర్థి అయినా నిష్కళంకుడైన ఇండిపెండెంట్ అభ్యర్థి గోగినేని శ్రీనివాస పోటీ  తమకేమైనా ఉపయోగమేమోనని ఆశలు.
బలహీనతలు: ఇంక్లూసివ్ టీం అని చెప్పుకుంటూ ‘తానా’ను కబంధ హస్తాల్లో పట్టి ఉంచి వారి అడుగుజాడల్లో పయనించడం,  తమ ఊళ్ళోనే ఉన్న బాహుబలి బలం కంటే ప్రస్తుతం ఆయన బలహీనత డామినేట్ చేస్తున్నట్టు అందరూ అనుకోవడం, అలాగే ఆయన తో ఉన్న సుదీర్ఘ బంధం, గత ‘తానా’ కాన్ఫరెన్స్ లెక్కల్లో ఇబ్బందికర పరిస్థితి, ఆయనపై జరుగుతున్న ట్రోలింగ్ లు తన పోటీకి ఎంత దెబ్బో అర్థం కాకపోవడం, అలాగే ‘తానా’ కాన్ఫరెన్స్ లెక్కల్లో చైర్మన్ గా ఉన్న తనకు పెద్దగా కమిట్మెంటు ఉండదన్న విషయం చెప్పలేక పోవడం, ‘తానా’ కు సంబంధం లేని పర్సనల్ వ్యవహారాల్లో ట్రోలింగులకు గురవ్వడం, అలాగే కొద్దిమంది ప్యానెల్ సభ్యులు తమ ప్యానెల్ బలంపై ఇంకా ఎక్కడో అనుమానంతో ఎందుకైనా మంచిదని స్వంతంగా కాని, వేరే ప్యానెల్ వ్యక్తులతోగాని వోట్ల కోసము పాకులాడటం. ఇంకా ‘తానా’ క్రియాశీలక వ్యవహారాల్లో పెద్దగా అనుభవం లేకపోవడం, ముగ్గురు మరాఠీ గాడ్ ఫాదర్ లపై ఎక్కువగా ఆధారపడటం, అడ్రెస్స్ మార్పు వ్యవహారంలో గాని, ప్యానెల్ సభ్యుల నామినేషన్ల నిరాకరణలో గాని పెద్దగా పోరాటతత్వం చూపలేక పోవడం బలహీనతలే.

నిరంజన్ శృంగవరపు: అమ్మ పుట్టిల్లు మేనమామ కి తెలియదా?

గోబెల్స్ ప్రచారం తరహాలో ‘తానా’ అంటే తామే అని మొదలుపెట్టి, కప్పదాట్ల నయా సంస్కర్తల బలం మీద ఓవర్ ఎస్టిమేట్ తో, తమ కార్పొరేట్ తరహాలో 80/20(IT జాబ్ లో ప్రాఫిట్ ఫార్ములా కాదండోయ్, తమకు 80% ఓట్లు, మిగతా వారందరికీ 20% ఓట్లు) తో మొదలై ప్రాక్సీ దొంగ ఇంటర్వ్యూల తరహా లో ప్రస్తుత మరియు తదుపరి అధ్యక్షులతో అమెరికా టూర్ చేయించి, వారికి వారి వందిమాగదులకు టూర్, లాడ్జి, బోర్డింగ్,ఎయిర్ ఫేర్, బ్లూ లేబల్, లిమో వగైరా సదుపాయాలతో  అమెరికా అంతటా తిప్పిన తరువాత కూడా పరిస్థితి 50/50 కి అటూ ఇటూ గా తేలడం, క్రింద మీద పడటం, దానిని ఒప్పుకోవడం ఎవరికైనా ఇబ్బందే. దానికి తోడు ఏ మచ్చ లేని ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభ్యర్థి  శ్రీనివాస గోగినేని సుడిగాలి లా చేసుకుంటున్న ప్రచారం ఆకర్షణీయంగా ఉండడంతో పాటు, తాము ఇతరులను కట్టడి చేయడానికి చేసిన  ప్రయత్నాలు బెడిసి కొట్టటమే కాక స్వంత రాష్ట్రంలో కూడా ఎటువంటి సేవలు చేసిన చరిత్ర లేకపోవడం ఒప్పుకోవాల్సిన నిజం.
బలాలు: ఆల్మోస్ట్ గెలిచిన నమ్మకం కలిగించిన ముందు రోజుల్లో ఆకర్షించుకొన్న చెదురుమొదురు బలాలు, ప్రస్తుత మరియు తదుపరి అధ్యక్ష అభ్యర్థులు తమ కోసం చేర్పించుకున్న సభ్యుల ఓట్లు, ఇంక్లూసివ్ టీం గాడ్ ఫాదర్ల మూలంగా కముకు దెబ్బలు తిని చెల్లాచెదురైన వారిలో గోగినేని సపోర్టర్స్ మినహా కొద్దిమంది, కార్పొరేట్ వ్యవస్థలకు రీసెంట్ గా వచ్చిన ఆర్థిక దన్ను, ప్యానెల్ సభ్యుల్లో ఎక్కువ మంది ప్రస్తుత మరియు తదుపరి అధ్యక్ష సన్నిహితులవడం కారణంగా పక్క చూపులు చూడక పోవడం(ఒక్క బోర్డు మెంబర్ పదవికి మినహా ).
బలహీనతలు: ముందే గెలిచి పోయామని ఊహించుకోవడం, 75% శాతం నాయకులు తమతో ఉన్నారని చెప్తూ కూడా తమది చేంజ్ ప్యానెల్ అని చెప్పుకోవడం, ప్రస్తుత మరియు తదుపరి అధ్యక్ష అభ్యుర్థులు ప్రసంగాలలో అభ్యర్థులు ఏమి చేసారు ఏమి చేస్తారు అని చెప్పేకంటే తమ గురించి, తమ సేవల గురించి పడికట్టు డైలాగుల మోజు చూపించడం, కాన్ఫరెన్స్ లెక్కల గురించి ఎన్నికల వరకు ఆగి, ఇప్పుడే గోల చేసే ప్రయత్మ చేయడం, ట్రాన్స్పరెన్సీ అని చెప్పుతూ తాము చేశామని చెప్పుకుంటున్న విరాళాలు గురించి రోజు కోమాట చెప్పటం, టీం నాయకునిగా ప్యానెల్ కు నిరంజన్ బలంగా మారలేక ఇతరుల పై ఆధారపడటం, తన విరాళాల, రాజకీయ సంబంధించిన విషయం లో  తర్జన భర్జనకు గురి కావడం. తాము విమర్శిస్తూ తీవ్రమైన ట్రోలింగులు కూడా చేస్తున్న అవతలి ర్గంతోనే మూడు నెలల క్రితం వరకు ఆత్మీయ బంధం తో చేసుకున్న పచ్చని కాపురం లో తామే నిప్పులు పోసుకోవడం, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడం లో శ్రీనివాస గోగినేని మరియు ఇంక్లూసివ్ టీం సఫలీకృతులవ్వడం.

శ్రీనివాస గోగినేని: ఒకే ఒక్కడు – అందరి దుమ్ము దులిపేసాడు
ఒకసారి పోటీ చేసి ఓడిపోయినా బాలట్ కలెక్టర్ల వ్యవస్థ నిరుత్సాహపరుస్తున్నా ‘తానా’ సాధారణ సభ్యుల్నినమ్ముతూ, ‘తానా’ అభ్యున్నతి కోసం చివరిసారిగా ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ, చతురంగ బాలాలతో కదం తొక్కుతున్న రెండు వర్గాల్ని నిలువరిస్తూ ఎందులోనూ తగ్గకుండా నిర్భయంగా చేస్తున్న ప్రచారం అమెరికా తెలుగు ప్రజానీకానికి ఒక సందేశాత్మకంగానూ ఒక ఉన్నతమైన మరియు అనుసరణీయంగానూ సభ్యులని  ఆకర్షిస్తూ ఆయన చెప్తున్న “నవతానా” నిజంగానే సాధ్యమేమో అనిపిస్తోంది.
బలాలు: నిష్కళంక చరిత్ర, సుదీర్ఘ అనుభవం, రెండు వర్గాలు కలసి ‘తానా’ ను నియంత్రిస్తున్నప్పుడే ఎదిరించిన సాహస చరిత్ర, మన ఊరి కోసం వంటి పెద్ద కార్యక్రమ నిర్వాహకుడు, అనేక పెద్ద నగరాలలో నిర్వహించిన 5కే వాక్/రన్ ల కారణంగా అమెరికా వ్యాప్తం గా గుర్తింపు, ఇంతకు ముందు ఒకసారి పోటీ కారణంగా సానుభూతి, ఓటర్లను ఉత్తేజ పరుస్తున్న ఆధునిక వాస్తవిక ప్రచార సరళి, 20కి పైగా టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ల ద్వారా ‘తానా’ గురించి, ఎన్నికల గురించి, తాను చెప్తున్న “నవతానా” ద్వారా చేయదలచిన ఆశయాలగూర్చి ప్రభావంతం గా చేసిన వివరణలు అందరికీ చేరడం, స్ఫూర్తివంతమైన మరియు ప్రభావవంతమైన ఇమెయిల్ మరియు టెక్స్ట్ మెసేజీ లద్వారా ఓటర్లను  ఆకట్టుగొ గలగడం, వర్గ వ్యవస్థ మూలంగా వచ్చే నష్టాలు, సంస్థ చీలిపోయే ప్రమాదాలు మరియు బాలట్ కలెక్టర్ల ఆగడాలపై ప్రజలలో స్ఫూర్తి కలిగించడం. అలాగే వర్గాలుగా చీలిపోగా గెలవడానికి కావలసిన  సంఖ్య తగ్గి పోవడంతో పాటు స్వచ్ఛంద ఓటు బ్యాంకు గణనీయంగా ఉండడం
బలహీనతలు: ప్యానెల్ లేక పోవడం కొంతమంది బలహీనమేమోనని అపోహ పడటం, బాలట్ కలెక్టర్లు మంచి వారిని గెల్వనివ్వరేమో నని బావిస్తుండడం, వర్గతత్వం సమాజంలో గుర్తింపు ఉన్నవారిలో కూడా జీర్ణించుకుపోవడం.

ఏతా వాతా  పైన  సూచించిన వివరాల్ని బట్టి ఏమైనా జరగొచ్చు, “ఏమో గుర్రం ఎగరా వచ్చు”

ఏదేమైనా మరొక్క సారి: “నిగ్గ  తీసి అడుగు ఈ సిగ్గులేని బాలట్ కలెక్టర్లను, లాగి ఒక్కటివ్వు ఇంకా తగులుకుంటే, అగ్నితోటి కడుగు ఈ ‘తానా’ సంస్థ మురికిని, మారాలి ఈ నాయకులు, మారాలి ‘తానా’ ఓటర్లు, మారాలి మన ‘తానా’, ఆవిష్కరించాలి మళ్లీ గర్వపడే ‘కొత్త తానా’

Tags: ballotsTana elections
Previous Post

ఈటల ఎపిసోడ్ లో… తర్వాత జరిగే పరిణామాలు ఇవేనా?

Next Post

మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే.. చినబాబు ఫైర్

Related Posts

pawan kalyan
Movies

పవన్-హరీష్.. సర్వం సిద్ధం

March 21, 2023
ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
Trending

ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్

March 20, 2023
Trending

అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు

March 20, 2023
viveka murder case
Trending

ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌

March 20, 2023
Load More
Next Post

మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే.. చినబాబు ఫైర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • పవన్-హరీష్.. సర్వం సిద్ధం
  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల ఘర్షణ
  • 3…  చూడ్డానికే మూడే కానీ YCP కి మూడినట్లే

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra