• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘తానా’ఎన్నికల ఓటర్స్ లిస్ట్ లో కుంభకోణం – ‘గండికోట రహస్యం’

త్వరలో 'గండికోట రహస్యం' బట్టబయలు కానుందా??

admin by admin
April 24, 2021
in TANA Elections, Trending
0
TANA
0
SHARES
1.7k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అనుకున్నంత అయ్యింది ‘ఇంక్లూజివ్’ అంటూ ఒకరు ‘చేంజ్’ అంటూ ఒకరు రెండు వర్గాలుగా చీలి అమెరికా అంతటా వేసిన గంతులు చిందులు వెనుక  గమ్మత్తుగా ఓటర్ల లిస్టు లో చేసిన అక్రమాల భాగోతం అత్యంత అనుభవజ్ఞులు,నిజాయతీపరులైన పెద్దమనుషులుతో  కూడిన ఎలక్షన్ కమిషన్ పుణ్యమా అని బయట పడుతున్నట్లు తెలుస్తోంది.అత్యంత హేయమైన ఈ చర్య ‘చేంజ్’, ట్రాన్స్పరెన్సీ, సంస్కరణ, బొంగు, భోషాణం అని బయటకు చెప్పుకుంటూ ఉన్న నిరంజన్ ప్యానెల్ సభ్యులు, గాడ్ ఫాదర్ లు, సపోర్టర్స్ గుంభనగా నిస్సిగ్గుగా చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.

‘తానా’ సభ్యుల డేటాబేస్ నిర్వహణ మరియు ఓనెర్షిప్ ‘తానా’ బైలాస్ ప్రకారం ‘తానా’ సెక్రటరీ కాగా, ప్రస్తుతం ఉన్న నాయకత్వం హోదాలో ఆయనకు పైనా క్రింద ఉన్న ఇతర నాయకుల సంఘటిత గూడు పుఠాణీతో పక్కకు తోసి రెండు మూడు సార్లు గా క్రమ క్రమంగా కొన్ని వేల సభ్యుల అడ్రస్ మార్పులను తమకు అనుకూలంగా సాగించి గమ్మున ఉన్నారు.ఇది పిల్లి దొంగతనంగా పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటున్నట్లు ఉండగా, దీనికి కాపలా దారులైన నిజాయితీపరులైన ‘ఐనంపూడి కనకం బాబు’ గారి నాయకత్వం లోని ఎలక్షన్ కమిషన్ పట్టేసినట్టు గట్టి సమాచారం. ఇప్పటికే ప్రింట్ అయి పోస్ట్ కావలసిన బాలట్స్ ను ఆపివేసి, కొద్ది రోజుల్లో మళ్ళీ ప్రింట్ చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నట్లు ఎలక్షన్ కమిషన్ పంపిన సమాచారాన్ని విశ్లేషించి, నిజాల్ని తవ్వగా సభ్య సమాజం విస్తుపోయే విషయాలన్నీ తెలియవచ్చి ప్రజలు తలలు పట్టుకున్నారు. దీనిపై ‘తానా’ లీడర్షిప్ లోపలా, బయట, తెలుగు కమ్యూనిటీ లోను ఒక్కసారిగా నిరసనలు ఆగ్రహావేశాలు పెల్లుబుకి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుపడుతున్నారు.

ఈ దుశ్చర్య క్రియా పరంగా ‘గల్లీ నాయకుడు’గాను ‘కప్పదాటు’ ద్వయంలో ఒకడుగాను ప్రసిద్ధుడై, కోశాధికారి పదవికి పోటీ చేస్తూ, ప్రస్తుత సంయుక్త కార్యదర్శి అయిన అశోక్ కొల్లా ముఖ్య భూమిక పోషించగా, వచ్చే అధ్యక్షుడుగా లావు అంజయ్య చౌదరి, ప్రస్తుత అధ్యక్షుడు జయ్ తాళ్లూరి, ప్రస్తుత బోర్డు చైర్మన్ హరీష్ కోయ లు హుందాగా ఉండవలసినప్పటికీ, నిరంజన్ పానెల్ కి బహిరంగంగా కొమ్ము కాస్తూ, ఈ ‘గల్లీ నాయకుడు’కి పరోక్షంగా సహాయంగాని, ప్రోత్సాహంగాని ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా నిస్పాక్షికంగా ఉంటారని ఆశిస్తూ ఓటర్ల లిస్టును నెక్స్ట్ ప్రెసిడెంట్ కు బైలాస్ దాఖలు పరచగా, దానికి ‘సిగ్గు’ తెచ్చే విధంగా ప్రస్తుత నెక్స్ట్ ప్రెసిడెంట్ లావు అంజయ్య చౌదరి వ్యవహరించినట్లు, దీని ముఖ్య బాధ్యత కూడా ఆయనే తీసుకోవాల్సి వస్తుందని తెలియ వస్తోంది. వెరసి రాబోయే ఒకటి రెండు రోజుల్లో దీనిపై ‘తానా’ బోర్డ్ అత్యవసర సమావేశం నిర్వహించి వీరిపై చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఒక వేళ సమావేశం జరగక పోయినా, జరిగి చర్యలు లేక పోయినా వెంటనే కోర్టు తలపు తట్టడానికి ప్రయత్నాలు చురుకుగా జరుగుతున్నట్లు నరేన్ కొడాలి వర్గ నాయకుల ద్వారా తెలిసిన గట్టి సమాచారం. గుట్టుగా సాగించిన ఈ వ్యవహారాన్ని అర్థం చేసుకొని ఎంతో కొంత సంస్థ మంచి కోసం తాపత్రయపడే గత అధ్యక్షులు, ప్రస్తుత బోర్డు సభ్యులు ‘డాక్టర్ జంపాల చౌదరి’, ‘డాక్టర్ బండ్ల హనుమయ్య’ లు ఇప్పటికైనా మేల్కొని బాధ్యులపై చర్య తీసుకొని ‘తానా’ ప్రతిష్టను కాపాడి, తమ పరపతిని కూడా నిలుపుకుంటారని పలువురు ఆశిస్తున్నారు.

ఇటువంటిది జరగడానికి అవకాశం ఉందని, సరైన చర్యలు, చెక్ అండ్ బాలన్స్ ముందు నుంచే తీసుకోవాలని, వ్యాధికి చికిత్స కంటే నివారణ మేలని ఎన్నోసార్లు తన ఈమెయిల్స్ ద్వారా హెచ్చరిస్తున్న అత్యంత అనుభవజ్ఞుడు, నిజాయితీపరుడైన ప్రస్తుత ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభ్యర్థి శ్రీనివాస గోగినేని సూచనలను పాటిస్తే ఈ అవమానకరమైన పరిస్థితి తప్పేదని పలువురు నాయకులు ఇప్పుడు మదనపడుతున్నారు. ఇంకా కొందరు రెండు వర్గాలు దొంగలేనని, చాలా సంవత్సరాలుగా కలిసి కాపురం చేసి ప్రస్తుతం కొట్లాడుకొంటూ మళ్ళీ ఏదో ఒక డీల్ చేసుకొని, సర్దుకొన్నా ఏమీ ఆశ్చర్యం లేదని వీరి గురించి బాగా తెలిసిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వెరసి రాబోయే రెండు మూడు రోజులు ‘తానా’ నాయకత్వానికి విషమ పరీక్ష అని, ‘తానా’ ఎన్నికల తర్వాత జరుగబోయే అంకానికి, సంచలన పరిణామాలకు సాక్షీభూతంగా నిలుస్తాయని పలువురు భావిస్తున్నారు.

ఇందులో చాలా భాగం ‘నమస్తే ఆంధ్ర’ ఎప్పుడో ఊహించి చెప్పింది (గల్లీ నాయకుడి బండారం గురించి, ఓవర్ ఏక్షన్ గురించి, బే ఏరియా కప్పదాటు ద్వయం చేసే సంస్కరణల బండారం గురించి, లావు అంజయ్యలో ఉన్న ఇంకొకడి  గురించి) –గుర్తు తెచ్చుకోండి లేదా క్రింద పాట చూడండి.

“ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు? విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు? కంచెయే తానుగా చేను మేసినా కాదను వారెవరూ? ఏ  నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ?”

‘హతం హతోస్మి’

Tags: Tana electionsvoters list scam
Previous Post

ఇవిగో ప్రూఫులు : కలిసేది కేసుల కోసమే!

Next Post

covid: ఈ దృశ్యాలు చూస్తే ఏడుపు ఒక్కటే తక్కువ !!

Related Posts

purandheswari
Andhra

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

March 21, 2023
pawan kalyan with nithin
Movies

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

March 21, 2023
pawan kalyan
Movies

పవన్-హరీష్.. సర్వం సిద్ధం

March 21, 2023
ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
Trending

ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్

March 20, 2023
Load More
Next Post

covid: ఈ దృశ్యాలు చూస్తే ఏడుపు ఒక్కటే తక్కువ !!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!
  • పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు
  • పవన్-హరీష్.. సర్వం సిద్ధం
  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra