ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక పరిస్థితి గురించి జనాలు అందరూ బాగుందని అను కుంటున్నారని.. కానీ, బిహార్ రాష్ట్రం కంటే కూడా దారుణంగా ఆర్థిక పరిస్థితి ఉందని చెప్పారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడగానే సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ అమలు చేసేందుకు వెనుకాడబోనన్నారు. గతంలో జగన్ మాదిరిగా తాను వ్యవహరించలే నని చంద్రబాబు చెప్పారు. కేంద్రం వివిధ పథకాలకు నిధులు ఇస్తోందని.. వాటిని ఇతర కార్యక్రమాలకు మళ్లించడం ద్వారా జగన్ తప్పులపై తప్పులు చేశారని చంద్రబాబు విమర్శించారు.
ఐదేళ్ల వైసీపీ హయాంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయో కూడా తెలియకుండా పోయిందన్నారు. ఇప్పుడు లెక్కలు చెప్పమని కేంద్రం అడుగుతోందని.. కానీ, తమకు లెక్కలు కనిపించడం లేదని అన్నారు. ఆర్థిక పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉందని చంద్రబాబు తెలిపారు. “మాట తప్పను. పథకాలను అమలు చేస్తా. కానీ, ప్రజలు కొంత సంయమనం పాటించాలి. అప్పు చేసి అయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం… తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తాం“ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆ ఐదేళ్లు మేమే ఉంటే..
2019-24 మధ్య ఐదేళ్ల పాటు ఏపీలో తమ ప్రభుత్వమే ఉంటే రాష్ట్ర ఈ దేశానికే తలమానికంగా ఉండేదని చంద్రబాబు వ్యాఖ్యానిం చారు. కానీ, ఐదేళ్ల కాలంలో వైసీపీ సర్వం నాశనం చేసిందన్నారు. దీంతో విలువైన ఐదేళ్ల సమయం ఏపీ ప్రజలు కోల్పోయారని అన్నారు. గత ఐదేళ్లలో వృద్ధి పెరిగి ఉంటే.. రాష్ట్రం ఆర్థికంగా బాగుండేదని చెప్పారు. జగన్ చేసిన అప్పులు కొంప ముంచుతు న్నాయని అన్నారు. వైసీపీ హయాంలో 9.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని.. వీటికి వడ్డీలు కట్టే సరికి తల ప్రాణం తోకకు వస్తోందన్నారు. అనేక చర్యల ద్వారా.. పొదుపు పాటిస్తున్నామని.. ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతోందనిసీఎం చెప్పారు. ఏదేమైనా.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు తెలిపారు.