వరుస పరాజయాల తర్వాత గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ.. ‘రంగమార్తాండ’తో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేశాడు. మరాఠీలో సక్సెస్ అయిన ‘నటసామ్రాట్’కి ఇది రీమేక్. ఒరిజినల్లో నానా పటేకర్ చేసిన పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు కృష్ణవంశీ. మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీకి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు ట్విటర్లో రివీల్ చేశాడు కేవీ. డబ్బింగ్ సూట్ లో ఉన్న చిరంజీవి ఫొటోని కూడా కృష్ణవంశీ పోస్ట్ చేశాడు. ‘ఎటువంటి అభ్యంతరాలూ చెప్పకుండా.. అడగ్గానే ఒప్పుకుని వాయిస్ ఇచ్చినందుకు థాంక్యూ అన్నయ్యా’ అంటూ మెగాస్టార్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా చెప్పాడు.
ఈ సినిమా మొదలై చాలాకాలమే అయ్యింది. కరోనా, లాక్డౌన్ అంటూ చాలాసార్లు ఆగింది. రెండో లాక్డౌన్ ఎత్తేసి అన్ని సినిమాల షూటింగ్ లు మొదలై….విడుదలవుతున్నా కూడా ఈ సినిమా ఊసేమీ లేకపోవడంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందనే సందేహాలు తలెత్తాయి. పైగా ఒక సినిమా తర్వాతే మరో సినిమాని అనౌన్స్ కేవీ.. ‘రంగమార్తాండ’ ఓ కొలిక్కి రాకుండానే ‘అన్నం’ అనే సినిమాని అనౌన్స్ చేయడం ఆ అనుమానాలకు బలం చేకూర్చింది.
అయితే, ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ రీసెంట్గా ‘రంగమార్తాండ’ షూట్ స్టార్ట్ చేశాడు కృష్ణవంశీ. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇళయరాజా మ్యూజిక్ ఇస్తూ ఉండటం ఈ సినిమాకి అడిషనల్ క్రేజ్‌ని తెచ్చింది. ఇప్పుడు మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం చూస్తుంటే కేవీ ఏదో స్ట్రాటజీతో వెళ్తున్నట్టు అనిపిస్తోంది. అదెంత వరకు వర్కవుటవుతుందో చూడాలి మరి.