దేశ జనాభా విషయంలో డ్రాగన్ అధ్యక్షుడు జిన్ పింగ్ కీలకమైన ప్రకటన చేశారు. ఇక నుండి ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనొచ్చనే వెసులుబాటు ఇచ్చారు. ప్రస్తుతం చైనాలో జంటలు ఇద్దర పిల్లలను కనటానికి ప్రభుత్వం అనుమతుంది.
చైనా దంపతులు ఎంతమంది పిల్లలను కనాలనే విషయంలో ప్రభుత్వానిదే ఫైనల్ డెసిషన్. ప్రభుత్వ నిర్ణయాన్ని కాదంటే సమస్యల్లో ఇరుక్కున్నట్లే.
ఇంతకీ ఇంత అర్జంటుగా ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలను కనండని చైనా అధ్యక్షుడు జనాలకు ఎందుకింత బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ? ఎందుకంటే దేశంలో ముసలోళ్ళ జనాబా పెరిగిపోతోందట.
ప్రస్తుత చైనా జనాభా సుమారు 143 కోట్లు. ఇందులో వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందట. దేశం అభివృద్ధి జరగాలంటే ముసలోళ్ళ వల్లేమవుతుంది ?
ఏ దేశం అభివృద్ధి జరగాలన్నా అది యువత వల్లే సాద్యమవుతుంది. చైనాలో ఇపుడు యువత సంఖ్య బాగా తక్కువగా ఉందట. దీనికి కారణం ఏమిటంటే ఒకపుడు దేశజనాభాను నియంత్రించటానికి పిల్లలను కనటంపై ప్రభుత్వం బ్యాన్ విధించింది.
1976లో వచ్చిన ఆర్డర్ ప్రకారం ప్రతిజంట కేవలం ఒకరిని మాత్రమే కనాలి. అంటే అప్పటి ఆర్డర్ ప్రకారం 1976 ప్రాంతంలో పుట్టిన పిల్లలకే ఇపుడు సుమారు 50 ఏళ్ళుంటుంది. ఒకే సంతానం అనే ఆర్డర్ 2016 వరకు అమల్లో ఉంది.
దేశజనాభాను గమనించిన ప్రభుత్వం 2016లో ఆందోళనలో పడిపోయింది. ఎందుకంటే కేవలం ఒకే సంతానం అనే నిబంధన వల్ల రెండో సంతానం కనేందుకు లేక, పుట్టిన ఒక సంతానం ఏదో కారణంతో చనిపోతే ఆ కుటుంబం బాధ వర్ణనాతీతంగా ఉండేదట. కానీ అసలే డ్రాగన్ దేశం కదా అందుకని ఎదురు ప్రశ్నించే అవకాశమే లేకపోయింది.
దాంతో చాలా ప్రాంతాల్లో జంటలు అసలు సంతానమే వద్దనే పద్దతిలో నిరసన తెలిపారట. దాంతో ఏమైందంటే ఇపుడు దేశంలో యువత సంఖ్య తగ్గిపోయింది.
ఈ విషయాన్ని గమనించిన డ్రాగన్ అధ్యక్షుడు 2016 తర్వాత ప్రతి జంట ఇద్దరు సంతానాన్ని కనచ్చనే వెసులుబాటు ఇచ్చారట. అయితే అప్పటికే సంతానంపై జంటల్లో అయిష్టత పెరిగిపోయిందట.
దాంతో జనాభా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఈ విషయాలన్నీ గమనించిన జిన్ పింగ్ తాజాగా ముగ్గురు పిల్లలను కనండనే బంపర్ ఆపర్ ఇచ్చారు. మరి జంటలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సిందే.