కొలువు తీరిన చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రులకు ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి తగ్గట్లే శాఖల కేటాయింపు జరిగింది. జనసేనాని తనకు ఆసక్తి ఉన్న శాఖల్ని పేర్కొన్నట్లుగా వచ్చిన వార్తలకు తగ్గట్లే ఆయనకు శాఖల కేటాయింపు జరిగింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హోం శాఖ మీద మాత్రం ముఖ్యమంత్రి ఎవరికి కేటాయిస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంచనాలకు భిన్నంగా ఈ కీలక శాఖను వంగలపూడి అనితకు కేటాయించటం ఆసక్తికరంగా మారింది. ఇక.. లోకేశ్.. అచ్చెన్నాయుడు.. నాదెండ్ల మనోహర్.. కొల్లు రవీద్ర, టీజీ భరత్ సహా పలువురు మంత్రుల శాఖలు అంచనాలకు తగ్గట్లే కేటాయింపులు సాగాయి.
తాజాగా విడుదలైన జాబితాలో మంత్రులు.. వారికి కేటాయించిన శాఖల్ని చూస్తే..
సినిమా, రూరల్ కీలకమైన ఈ రెండూ జనసేన చేతికి వెళ్లాయి. పొంగూరు నారాయణకు అతను గతంలో చేసిన శాఖలే దక్కాయి. కీలకమైన ఐటీ, పరిశ్రమలు, టెక్నాలజీ శాఖలు యువ నేతలు లోకేష్, భరత్ లకే దక్కాయి. ఇది రాష్ట్ర మర్యాదను పారిశ్రామిక వేత్తల్లో పెంచుతుందనడంలో సందేహం లేదు. హోం శాఖ
– నారా చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి, జీఏడీ, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజస్ తో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
– కొణిదల పవన్ కల్యాణ్
పంచాయితీ రాజ్, గ్రామీణాభివ్రద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ
– నారా లోకేశ్
మానవ వనరుల అభివ్రద్ధి, ఐటీ కమ్యూనికేషన్ల శాఖ
– వంగలపూడి అనిత
హోం శాఖ, విపత్తుల నిర్వహణ
– కింజరాపు అచ్చెన్నాయుడు
వ్యవసాయం, సహకార శాఖ, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ, డెయిరీ డెవలప్ మెంట్, మత్స్యశాఖ
– కొల్లు రవీంద్ర
గనులు, ఎక్సైజ్ శాఖ
– నాదెండ్ల మనోహర్
పౌరసరఫరాల శాఖ
– పి. నారాయణ
మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్
– సత్యకుమార్ యాదవ్
ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, మెడికల్ ఎడ్యుకేషన్
– నిమ్మల రామానాయుడు
జలవనరుల అభివ్రద్ధి శాఖ
– ఎన్ఎండీ ఫరూక్
న్యాయ, మైనార్టీ సంక్షేమం
– ఆనం రామనారాయణ రెడ్డి
దేవాదాయ శాఖ
– పయ్యావుల కేశవ్
ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభా వ్యవహారాలు
– కొలుసు పార్థసారధి
హోసింగ్, ఐఅండ్ పీఆర్
– అనగాని సత్యప్రసాద్
రెవెన్యూ శాఖ
– డాక్టర్ డోలా బాల వీరాంజయనేస్వామి
సాంఘిక సంక్షేమ శాఖ
– గొట్టిపాటి రవికుమార్
విద్యుత్ శాఖ
– కందుల దుర్గేష్
పర్యాటకం, సంస్క్రాతిక శాఖలు
– గుమ్మడి సంధ్యారాణి
స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు
– బీసీ జనార్థన్
రహదారులు, భవనాల శాఖలు
– టీజీ భరత్
పరిశ్రమలు
– ఎస్ సవిత
బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖలు
– వాసంశెట్టి సుభాష్
కార్మిక, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్
– కొండపల్లి శ్రీనివాస్
ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపర్మెంట్ శాఖలు
– మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రవాణా, యువజన, క్రీడా శాఖలు