కొద్ది రోజులుగా ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు వెళ్లిన ప్రతిచోట..ఆయనకు జనం జేజేలు పలుకుతున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని….లేకుంటే ఏపీ స్థితి అధోగతేనని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన సొంత ఇలాకా కుప్పంలో పర్యటించిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలోనే కుప్పం పరిధిలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు చంద్రబాబుకు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
యూనివర్సిటీలో కనీస సదుపాయాలు కరువయ్యాయని, చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని చంద్రబాబుకు వారు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ‘‘బాబు రావాలి.. మా బాధలు తీరాలి’’ అంటూ రీసౌండ్ వచ్చేలా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించమని కోరినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ విద్యార్థులు వాపోయారు. ఈ క్రమంలోనే జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ఏపీలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉన్నాయని, కానీ, ఏపీలో మాత్రం ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు. కనీసం సీఎం కాన్వాయ్కి కార్లు కూడా పెట్టుకోలేని స్థితిలో రాష్ట్రం ఉండడం అవమానకరమని దుయ్యబట్టారు. బిల్లుల చెల్లించకుంటే అధికారులు కార్లు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.
బిల్లులు రాక యజమానులు పడే బాధలకు ఎవరిది బాధ్యత? అని చంద్రబాబు నిలదీశారు. వ్యవస్థల నిర్వీర్యంతో అధికారులు, ఉద్యోగులు కూడా.. తీవ్ర ఒత్తిడికి లోనై తప్పులు చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వం తెచ్చిన అప్పులు.. పెండింగ్లో ఉన్న బిల్లుల అంశంపై వాస్తవాలు వెల్లడించగలరా? అని జగన్ ను చంద్రబాబు నిలదీశారు.
బాబు రావాలి… మా బాధలు తీరాలి… ద్రవిడ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నినాదాలు. pic.twitter.com/A5fTGw7xuC
— Telugu Desam Party (@JaiTDP) May 12, 2022