మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలపై కేంద్రం అత్యంత వేగంగా స్పందించింది.
చంద్రబాబు అలా చెప్పిన వెంటనే ఇలా ఉన్నతాధికారిని పరిశీలనకు పంపింది. అనంతరం 24 గంటలకు తిరగకుండానే చంద్రబాబుకు ఉన్న భద్రతను రెట్టింపు చేసింది.
చంద్రబాబు పట్ల కేంద్రం ఇంత సానుకూలంగా ఉన్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 4 సంవత్సరాల తర్వాత సడెన్ గా ఇటీవల మోడీ చంద్రబాబుకు ఆహ్వానం పంపడమే కాదు… మీటింగ్ లో ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు.
ఆ తర్వాత కేంద్రం నుంచి జగన్ విషయంలో నెగెటివ్ అప్ డేట్స్ వస్తుండగా.. చంద్రబాబు విషయంలో పాజిటివ్ అప్ డేట్స్ వస్తుండటం వైసీపీ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది
ఇటీవల పవన్ మాట్లాడుతూ చంద్రబాబు మోడీ కలుస్తారిన ఎవరైనా ఊహించారని అని చేసిన కామెంట్లు చూస్తే పరిస్థితులు బాగా మారిపోయాయని అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారం వెనుక ఏం జరిగిందో తెలియదు గాని బాబు పట్ల బీజేపీ చాలా సానుకూలంగా ఉన్న విషయం అయితే అందరికీ అర్థమవుతోంది.
నిన్న కుప్పంలో చంద్రబాబు పర్యటనపై రాళ్ల దాడి జరిగింది. వెంటనే దీనిపై కేంద్రం రియాక్ట్ అయ్యింది. ఇప్పటికే చంద్రబాబు భద్రతకు సంబంధించిన జెడ్ కేటగిరీ ప్రొటెక్ట్ ఉన్నా…. సెక్యూరిటీ ఆఫీసర్ల సంఖ్యను కేంద్రం డబుల్ చేసింది. నిన్నటివరకు చంద్రబాబు నాయుడుకి 6+6 సెక్యూరిటీ ఉండగా దానిని ప్రస్తుతం 12+12 సెక్యూరిటీ చేశారు.
ఎన్ ఎస్ జీ కమాండోలు ఎవరు?
ఈ దేశంలో ఏ అర్హత వున్నా నేరుగా అప్లయ్ చేసుకొని వెళ్లలేని ఉద్యోగం ఎన్ ఎస్ జి కమాండో అలియాస్ బ్లాక్ క్యాట్.
కేంద్ర భద్రతాదళాల నుండి విద్య, శారీరక & మానసిక పరీక్షలు నిర్వహించి తీసుకొంటారు. మళ్లీ 14 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. 26 రకాల కఠోర ట్రైనింగ్ వుంటుంది. ఆ నరకపు ట్రైనింగ్ లోనే 80% వరకు డ్రాప్ అయిపోతారు. మిగిలిన 20% మందికి అత్యాధునిక పిస్టల్ నుండి మెషిన్ గన్ వరకు 0% తప్పు చేయని విధంగా తీర్చిదిద్దే పని చేస్తారు.
అలాంటి కమాండోస్ ని ఈ మధ్య విఐపిలకు ఇచ్చే రక్షణ నుండి విత్ డ్రా చేశారు. వారి రక్షణ కోల్పోయిన ఆ జాబితాలో చాలా మంది ప్రముఖులు రాజ్ నాథ్ సింగ్ నుండి యోగి ఆదిత్యనాథ్ వరకు వున్నారు.
నిన్న ఒక అధికారి ఢిల్లీ నుండి రావడం, నాయుడి పార్టీ ఆఫీసు & ఇల్లు గట్రాలను తనిఖీలు చేయడం అంతా రొటీన్ అనుకొన్నారు. కానీ పొద్దునకల్లా 12 + 12 రెండు డజన్ల బ్లాక్ క్యాట్ కామెండోల సంఖ్య వరకు, నాయుడికి పెంచే సరికి, అందరి నొసలు ఆశ్చర్యంతో పైకి లేచాయి.
జరగబోయే కొన్ని పరిణామాలకు ముందస్తుగా కేంద్ర హోంశాఖ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రతిదానికీ చంద్రబాబు అనే పైశాచిక పాలకుల ఆధ్వర్యంలో ఏదన్నా ఆకతాయి పని జరిగితే, అది కేంద్ర హోంశాఖకు అవమానం అవుతుంది. అందుకే వెంటనే భద్రతను పెంచారు.