టీడీపీ అధినేత చంద్రబాబు కు కోర్టు 2 రోజుల సీఐడీ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమండ్రి జైలులో సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 9 మంది అధికారుల బృందం చంద్రబాబును విచారణ జరుపుతోంది. దమ్మాలపాటి శ్రీనివాస్, గింజుపల్లి సుబ్బారావులు చంద్రబాబు తరఫున హాజరయ్యారు. ఇక, ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో
ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ జరగనుంది. విచారణకు ముందు, తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలున్నాయి.
గంటకు 5 నిమిషాల బ్రేక్, మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈ విచారణ ప్రక్రియ అంతా సీఐడీ అధికారుల తరఫున రికార్డు చేస్తున్నారు. దీంతో, రాజమండ్రి జైలు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక, ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేయడాన్ని చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ ను విచారణకు సుప్రీం స్వీకరించింది. దీంతో, సోమవారంనాడు అది విచారణకు వచ్చే చాన్స్ ఉంది.