ఏపీ సీఎం జగన్ పై… టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో గురువారం.. మూడు రాజధానులు… హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సహా సీనియర్ సభ్యులు ధర్మాన ప్రసాదరావు.. వంటివారు మాట్లాడారు.
ఈ సందర్భంగా కోర్టు తీర్పులను ఉదహరిస్తూ.. శాసన వ్యవస్థలోకి న్యాయవ్యవస్థ జోక్యం పెరిగిందంటూ.. సభ్యులు వ్యాఖ్యానించారు. అదేసమయంలో మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదని.. సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది శాసనాలు చేసేందుకేనని వ్యాఖ్యానించారు.
దీంతో అసెంబ్లీలో జరిగిన ఘటనలపై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల అంశమే మీకు కీలకమని భావించినట్టు అయితే.. రాజీనామ చేసి, ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని.. ఎన్నికలకు రావాల ని సవాల్ చేశారు. మళ్లీ మూడు ముక్కలాటకు తెరదీశారని వ్యాఖ్యానించారు.
జగన్ మోహన్‌రెడ్డి కాదు.. జగన్ మోసపు రెడ్డి అని తీవ్రస్థాయిలో చంద్రనిప్పులు చెరిగారు. జగన్ లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమని చంద్రబాబు వ్యాఖ్యనించారు. వితండ వాదంతో చర్చలు చేస్తారా? అని శాసన సభపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగంలో జగన్ సుప్రీం కాదని.. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో సీఎం జగన్ ఇల్లు కట్టుకుంటే.. ఎవరికి ఎక్కువని చంద్రబాబు ప్రశ్నించారు. న్యాయమూర్తు లపై సోషల్ మీడియాలోనూ ఇష్టాను సారం వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు అన్నారు. “మీకు వక్రబుద్ధు లు ఉన్నాయి. దేనినైనా వక్రీకరిస్తున్నారు“ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులను ఎవరైనా శిరసావహించాల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరగని విధంగా .. ఒక ఎంపీని నిర్బంధించి.. కొట్టడం, చంపే ప్రయత్నం చేయడం జగన్ ప్రభు త్వానికే చెల్లిందని వ్యాఖ్యానించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చంద్రబాబు చెప్పారు.
రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేయడం జగన్ ప్రభుత్వంలోనే చెల్లిందని అన్నారు. ఎప్పటి నుంచో వచ్చిన భూమిని రైతులు.. ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వానికి ఒక ఒప్పందం మేరకు ఇచ్చారని.. దీని నుంచి జగన్ ప్రబుత్వం తప్పించుకోలేదని అన్నారు.