చంద్రబాబు వరుసగా తన రెండో పుట్టిన రోజును నిషేధించారు. ఈ మేరకు తన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ విన్నవించుకున్నారు.
నా పుట్టినరోజుకు ఒక ప్రత్యేకతను తీసుకురావడానికి మీరంతా చేపట్టే కార్యక్రమాలు అభినందనీయం. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు #COVID19 నుంచి రక్షణ పొందడం చాలా అవసరం.
అందుకే నా పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను కోరుతున్నాను. దయచేసి మీరంతా ఒకరికొకరు భౌతిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండండి. మీ అందరి క్షేమమే మీరు నాకిచ్చే జన్మదిన కానుక.
ఇది చంద్రబాబు ట్విట్టరులో పెట్టిన వినతి. గత ఏడాది కూడా చంద్రబాబు పుట్టిన రోజు సమయంలో లాక్ డౌన్ ఉన్నది.