పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా 5 రోజులపాటు సీఎం విదేశీ పర్యటన –
‘బ్రాండ్ ఏపీ ప్రమోషన్’ తో పెట్టబడులు సాధించే దిశగా సీఎం పర్యటన
కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు సీఎం
డిల్లీ నుంచి జ్యూరిచ్ వెళ్లనున్న సీఎం నేతృత్వంలోని బృందం
బృందంలో మంత్రులు లోకేష్, టీజీ భరత్, పరిశ్రమల శాఖ అధికారులు
అర్ధరాత్రి జ్యూరిచ్ లో ఉన్న భారత రాయబారితో సీఎం బృందం భేటీ
హిల్టన్ హోటల్ లో పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం బృందం
హోటల్ హయత్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న సీఎం బృందం
‘మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా ‘పేరు తో తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ
పెట్టుబడులపై తెలుగు పరిశ్రామికవేత్తలతో చర్చించనున్న సీఎం బృందం
తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం తర్వాత దావోస్ వెళ్లనున్న బృందం
దావోస్ లో లక్ష్మీ మిత్తల్ లో ప్రత్యేక సమావేశంకానున్న సీఎం బృందం
దావోస్ లో సీఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై సీఎం సమావేశం
పలు సంస్థల సీఈఓలు, ఛైర్మన్లతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు
యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో సమావేశం కానున్న సీఎం
వివిధ సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం
డబ్ల్యూఈఎఫ్ ఎనర్జీ ట్రాన్సిషన్, వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అంశంపై సీఎం చర్చ
‘ది నెక్ట్స్ వేవ్ పయనీరింగ్ ది బ్లూ ఎకానమి ఆఫ్ టుమారో’ అంశంపై సీఎం చర్చ
రోజూ కనీసం పదికి పైగా భేటీలు, సమావేశాల్లో పాల్గొననున్న సీఎం