నటసింహం నందమూరి బాలకృష్ణ `డాకు మహారాజ్` చిత్రంతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్య కు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. శ్రద్దా శ్రీనాథ్, చైల్డ్ ఆర్టిస్ట్ వేద అగ్రవాల్, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. థమన్ సంగీతం అందించాడు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన డాకు తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతోంది. ఇదిలా ఉంటే.. ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ డాకు మహారాజ్ మూవీ టీమ్ ను ఇంటర్వ్యూలో చేసింది. ఈ ఇంటర్యూలో బాలయ్య తన ఫిట్నెస్ సీక్రెట్ ను రివీల్ చేశారు. బాలయ్య ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అని అందర్నీ సుమ ప్రశ్నించగా.. ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. డైరెక్టర్ బాబీ మాత్రం యూనిట్ లో అందరు తినే ఫుడ్ బాలయ్య తింటారని చెప్పాడు.
బాబీ చెప్పిన సమాధానికే బాలయ్య ఓటేశారు. `ప్రొడక్షన్ ఫుడ్ తినడమే నా ఫిటినెస్ సీక్రెట్. మా ఇంటి పక్కన షూటింగ్ జరిగినా నేను ప్రొడక్షన్ ఫుడ్డే తింటారు. మా ఆవిడ తిడుతుంది.. ఇంట్లో వండి పంపిస్తాను కదా అంటుంది. అయినా మారను. ఇండస్ట్రీ ఫుడ్ తినడం వల్లే ఇంత హుషారుగా ఉన్నా` అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.