తన జైలు జీవితం గురించి కామెంట్ చేయడాన్ని జగన్ రెడ్డి అసలు భరించలేరు. అందుకే వీలైనంత మంది తెలుగుదేశం నేతలపై కేసులుపెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబును, ఆయన కుమారుడిని కూడా జైలుకు పంపాలన్న జగన్ ఆశ నెరవేరడం లేదు.
వారిని జైలుకు పంపడానికి ఏం ఆధారమూ దొరక్కపోవడం ఒకటైతే, వారు జైలు కెళితే సానుభూతి పెరుగుతుందన్న భయం కూడా మరోటి జగన్ ను వేధిస్తుంది. అందుకే చంద్రబాబు విషయంలో జైలు గురించి ఆలోచించలేదు. తాజాగా ఒక ఘటన జరిగంది. తొలిసారి చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై ఇద్దరిపై తాజాగా కేసులు నమోదయ్యాయి. ఆయనపై కేసు నమోదు కావడం ఏపీలో సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పోలీసుస్టేషన్లో చంద్రబాబు, నారా లోకేశ్ పై కేసు నమోదైంది. మంత్రి పబ్లిసిటీ కాన్వాయ్ వల్ల ఒక పాప చనిపోయిందన్నది టీడీపీ ఆరోపణ. ఇది నిజం కాదని వైసీపీ వాదన. ఈ ఘటనపై చంద్రబాబు లోకేష్ తీవ్రంగా స్పందించారు.
అయితే, వారి స్పందన ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణదుర్గం పోలీసులు చంద్రబాబుపై లోకేష్ పై కేసు నమోదు చేశారు. ఫిర్యాదు దారు విషయాలను పోలీసులు దాచిపెట్టారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 153-A, R/W 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.