ఏపీ సీఎం జగన్ చేసేదొకటి.. చెప్పేది మరొకటని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కానీ.. వైసీపీ నాయకులు మాత్రం ఈ వాదనను, విమర్శలను తోసిపుచ్చుతుంటారు. అయితే, వాస్తవంలోకి వచ్చేసరికి జగన్ చెబుతున్నది ఒకటి చేస్తున్నది మరొకటి అన్నట్టుగానే ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న బుట్టా రేణుక విషయంలో జగన్.. చాలానే చెప్పారు. ఆమె చాలా పేదరాలని.. ఆస్తులు అంతంత మాత్రమేనని చెప్పారు.
అయితే.. నిజాలు మాటల్లో దాగినా.. నాయకులు దాచినా.. ఎన్నికల సంఘం ముందు వాస్తవాలు ఒప్పుకొని తీరాలి కదా! తాజాగా బుట్టా రేణుక దాఖలు చేసిన నామినేషన్లో అసలు ఆస్తులు ఎన్ననేది తేలిపోయింది. ఆమె ఆస్తుల చిట్టాను ఆమే స్వయంగా వెల్లడించారు. దీనిని బట్టి.. రేణుక ఆస్తుల విలువ.. ఆమె భర్త పేరుతో ఉన్నవి 304 కోట్ల రూపాయలు. వీటికిఅదనంగా.. ఇళ్లు పొలాలు వంటివాటి విలువ 19 కోట్ల రూపాయలు. ఇక, అప్పులు 8 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి దీనిని బట్టి సీఎం జగన్ చెప్పింది నిజమేనా? అనేది ప్రశ్న.
అదేవిధంగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డిని కూడా ఇటీవల సీఎం జగన్ అంతంత మాత్రపు ఆస్తి ఉన్న వ్యక్తిగానే చూపించారు. ప్రజలకు పరిచయం కూడా చేశారు. కానీ, ఆయన వెలువరించిన.. అఫిడవిట్లో శిల్పా ఆస్తులు 132 కోట్లుగా ఉన్నాయి. అప్పులు కూడా.. 29 కోట్ల వరకుఉన్నాయి. చిత్రం ఏంటంటే.. 2014లో ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తివిలువ 50 కోట్లు మాత్రమే. కానీ, ఇప్పుడు ఏకంగా 132 కోట్లకు చేరడం గమనార్హం. సో.. ఇదీ వైసీపీలో పేద అభ్యర్థుల ఆస్తుల విలువ.