దాదాపు రెండు.. మూడు నెలల క్రితం జరిగినట్లుగా చెబుతున్న ఉదంతాలకు సంబంధించిన వీడియోలు ఒకటి తర్వాత ఒకటి చొప్పున బయటకు రావటం.. అవి కాస్తా పెనుదుమారంగా మారుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ను టార్గెట్ చేసినట్లుగా ఇవి బయటకు వస్తున్నాయి. అన్న ప్రశ్న లేవనెత్తేలా వీడియోలు వస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున బయటకు వస్తున్న ఈ వీడియోలు సంచలనంగానే కాదు.. రాజకీయంగా రచ్చ చేస్తున్నాయి.
హైదరాబాద్ శివారులో ఉన్న టెక్ మహీంద్ర యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థుల్నితీవ్రంగా కొట్టిన వీడియో రచ్చ ఒక కొలిక్కి రాకముందే.. మరో వైరల్ వీడియో బయటకు వచ్చింది. అందులో ఒక రూంలో పలువురు విద్యార్థులతో కలిసి బండ బూతులు తిట్టటమే కాదు.. అదే పనిగా చేయి చేసుకున్న వీడియోవైరల్ గా మారింది. కాలేజీలో ర్యాగింగ్ లో భాగంగానే ఇదంతా జరిగినట్లుగా చెబుతున్నారు. మొదటి వైరల్ వీడియోలో.. బండి భగీరధ్ స్నేహితుడి సోదరికి తెల్లవారుజామున నాలుగు గంటల వేళలో మెసేజ్ లు చేసి.. ప్రేమించమని ఫోర్సు చేసినట్లుగా దెబ్బలు తిన్న విద్యార్థి ఒప్పుకోవటం.. అదంతా ముగిసిన ముచ్చటగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కేసు తాజాగా దుండిగల్ పోలీస్ స్టేషన్ లోనమోదు చేశారు.
వర్సిటీకి చెందిన విద్యార్థుల వ్యవహారాల్ని చూసే ఉద్యోగి.. వైరల్ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయటం.. వారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం తెలిసిందే. దుండిగల్ పోలీస్ స్టేషన్ కు తన లాయర్ తో కలిసి వచ్చిన బండి భగీరధ్.. స్టేషన్ లో ఎవరితోనూ మాట్లాడలేదు. ఇదిలా ఉండగా.. బుధవారం మధ్యాహ్నం అతగాడికి చెందిన మరో వీడియో బయటకు వచ్చి.. బండి భగీరధ్ తనకు తోచిన విద్యార్థులపై దాడి చేస్తారా? అన్న భావన కలిగేలా వీడియో ఉంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. వైరల్ వీడియోలతో విద్యార్థులపై దాడులు చేసిన బండి భగీరధను సస్పెండ్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇదే విషయాన్ని వర్సిటీ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించిగా.. వారెవరూ అందుబాటులోకి రాకుండా ఉంటున్నారు. ఏ విషయం మీదా పెదవి విప్పేందుకు ఇష్టపడని పరిస్థితి నెలకొంది.