ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురించి తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో టచ్ ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. విషయం ఏదైనా…తమ పార్టీ డిఫెన్స్ లో ఉన్నా సరే…తనదైన మాటకారితనం, చమత్కార ధోరణితో తిమ్మిని బమ్మిని చేయడంలో అంబటిది అందెవేసిన చెయ్యిని ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. అయితే, అదే రీతిలో మహిళలకు సంబంధించిన వివాదాల్లో, లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడంలోనూ గతంలో అంబటి పేరు పలుమార్లు వినిపించింది. తాజాగా ఓ యూట్యూబ్ యాంకర్ పై అంబటి కామెంట్లు చేశారని వచ్చిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య ట్వీట్ వార్ తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ ఇంటర్వ్యూ అడిగితే…నాకేం ఇస్తావ్ అంటూ అంబటి అన్నారని అయ్యన్న ఆరోపించారు. మహిళా జర్నలిస్ట్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం జగన్ కు తెలిసిందని, త్వరలోనే ఆయన బర్తరఫ్ ఖాయమంటూ అయ్యన్న బాంబు పేల్చారు.
అయితే, ఏది ఏమైనా…తగ్గేదేలే అంటూ అయ్యన్న ట్వీట్ కు అంబటి రిప్లై ఇచ్చి తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అంబటి ట్వీట్‌కు అయ్యన్న స్పందించారు. “నువ్వంత సంబర పడితే మేము మాత్రం తగ్గుతామా? నువ్వు తగ్గొద్దు అంబటి రెచ్చిపో. నీకో హింట్… వైసీపీ, బ్లూ మీడియా కలిసే నిన్ను ఇంటికి పంపబోతున్నారు. ఇక నువ్వు పాత మెసేజ్ లు వెతుక్కునే పనిలో ఉండు, అస్సలు తగ్గొద్దు” అంటూ అయ్యన్న ఇచ్చిన కౌంటర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాగా, గతంలో అంబటి మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోన్న ఆడియో టేప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గుంటూరుకు చెందిన ఓ మహిళతో అంబటి ఫోన్ లో మాట్లాడినట్లుగా, తనకు మసాజ్ చేసేందుకు అమ్మాయి కావాలని అడిగినట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో దుమారం రేపింది.. మసాజ్ ఒక్కటే చేస్తుందా? ఇంకేం చేయదా? అని అంబటి అడగ్గా…. మీకేం కావాలో అన్నీ చేస్తుందంటూ..సదరు మహిళ జవాబిచ్చిందని ప్రచారం జరిగింది
ఆ మసాజ్ చేసే మహిళను తన ఊరికే పంపాలని అంబటి కోరగా.. అంబటిని గుంటూరుకు వస్తారా అని ఆ మహిళ ప్రశ్నించింది. అయితే, తన ఊరికే పంపాలని, అద్దె ఇల్లు పెద్దగా ప్రాబ్లమేమీ రాదంటూ అంబటి ఆమెకు భరోసా ఇచ్చినట్టు ఆ ఆడియో టేప్ లో ఉంది. తనకు మసాజ్ చేసే అమ్మాయి ఎవరు, వయసెంత? చెప్పినవన్నీ చేస్తుందా? బాగుంటుందా? అంటూ అంబటి కొంటె ప్రశ్నలు వేసినట్లు ఆ ఆడియో టేప్ లో ఉంది.
అయితే, ఆ మసాజ్ ఎపిసోడ్ కు ముందే అంబటిపై ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. గతంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు వచ్చిన ఓ మహిళ.. అంబటిపై సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో ఆ వ్యవహారం పెను సంచలనం రేపింది. అయితే అదే మహిళను వేరే ఛానల్ కు రప్పించగలిగిన అంబటి.. అదే మహిళతో అసలు విషయం ఇదేనంటూ చెప్పించి దాని నుంచి ఎస్కేప్ అయ్యారు. ఇక, తాజాగా అయ్యన్న చేస్తున్న విమర్శలు చూస్తుంటే అంబటి చుట్టూ ఉచ్చు బిగుసుకునేలా కనిపిస్తోంది.