వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ల మధ్య ట్వీట్ వార్ పతాక స్థాయికి చేరింది. టీడీపీ అంతు చూస్తామంటూ సాయిరెడ్డి చేసిన కామెంట్లకు అయ్యన్న గట్టిగా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ మొదలే చూడని వైసీపీ నేతలకు టీడీపీ అంతు చూసే సీన్ లేదని సెటైర్లు వేశారు. విశాఖలో విజయసాయి నిర్వహించిన జాబ్ మేళా నేపథ్యంలో వైసీపీ నేతలపై అయ్యన్న విమర్శలు గుప్పించారు.
‘‘జగన్ రెడ్డిని ఛీకొట్టి తల్లి, చెల్లి, బావ పక్క రాష్ట్రానికి వెళ్లిపోవడం కంటే పెద్ద ఛీత్కారం ఏముంటుంది? నీ రాజ్యసభ, జగన్ రెడ్డి సీఎం పదవి పోయే రోజు దగ్గర పడింది. ముందు జాగ్రత్త చర్యగా కార్యకర్తల కోసం నిర్వహిస్తున్న జాబ్ మేళా లో ఉద్యోగాలు రిజర్వ్ చేసుకోండి. లేకపోతే నిరుద్యోగులు జగన్ రెడ్డికి, నీకు బడిత పూజ చెయ్యడం ఖాయం. బ్రోకర్ జూమాంజి ముందు నత్తి పకోడీ హామీ ఇచ్చిన విధంగా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మేళా మొదలు పెట్టు.’’ అంటూ విజయసాయిపై అయ్యన్న సెటైర్లు వేశారు.
‘‘నీకు రాజ్యసభ రెన్యూవల్ లేదట కదా పార్టీ ఆఫీస్ లో కూర్చోని ట్వీట్లువేసుకునే ఉద్యోగం ఇచ్చారట కదా. నువ్వు, మీ నాయకుడు టీడీపీ మొదలు చూసేలోపే మరోసారి జైల్లో చిప్పకూడు తినిపిస్తాం. టీడీపీ అంతు చూడటం మీ నాయకుడి బాబు వల్లే కాలేదు, నువ్వెంత? విశాఖలో వేసిన చిల్లర వేషాల కారణంగా అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతా అని జగన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు 26 జిల్లాలు తిరుగుతా అని బీరాలు పలుకుతున్నాడు వీసా రెడ్డి’ అని అయ్యన్న ఎద్దేవా చేశారు.
‘‘ఏ1 జగన్ రెడ్డి గారు వాలంటీర్ల ఉద్యోగాలు ఇస్తే నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ ఏ2 విజయసాయి రెడ్డి సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు ఇప్పించాడట! జాబ్ మేళా అంటే ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, టెలికాం లాంటి రంగాల్లో ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నా….మీరు ఇచ్చేది సెక్యూరిటీ గార్డ్,హెల్పర్, సేల్స్ పోస్ట్ లని ఇప్పుడు తెలిసింది. (బ్లూ) మీడియా హడావుడి చూసి జగన్ రెడ్డి హామీ ఇచ్చిన 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎలాగో చెయ్యడం లేదు కనీసం వీసా రెడ్డి సీమ ప్రాంత బిడ్డలకు నాలుగు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తాడు అని ఆశ పడ్డాం. ఫైనల్ గా తేలింది ఏంటంటే రెజ్యుమ్ లు ఇచ్చి వెళ్ళమన్నారట. మీ ప్రచార యావ వల్ల రాను పోను ఛార్జీలు వృధా. మీ బ్రతుక్కి రూ.5 వేల జీతానికి మించి ఆశించి రావడం ముమ్మాటికీ తప్పే’’అని అయ్యన్న చురకలంటించారు.
‘‘తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో వారంలో 14 మంది శిశువులు చనిపోతే మీరు హ్యాపీగా ఎలా తినగలుగుతున్నారు? ఎలా నిద్రపోతున్నారు జగన్ రెడ్డి గారూ? వైసిపి చెత్త పాలనలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసారు. కేటాయింపులు, పర్యవేక్షణ లేక ప్రభుత్వాసుపత్రుల్లో మరణఘోష కొనసాగుతూనే ఉంపురిట్లోనే బిడ్డను కోల్పోయిన చెల్లెమ్మలకు ఎం సమాధానం చెబుతారు. ఎప్పటి లాగే మూర్ఖత్వంతో అవన్నీ సహజ మరణాలే అని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తే ఈ పాపం ఊరికే పోదు. రుయాలో శిశు మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే. మందులు, డాక్టర్లు కూడా అందుబాటులో లేరంటే.. ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతుంది. ఈ ఘటన పై విచారణ జరిపి బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలి’’అని అయ్యన్న డిమాండ్ చేశారు.