అమరావతి మీద వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని ఏనాడూ టీడీపీ గట్టిగా ఖండించకపోవడంతో ఆ అబద్ధాలను జనం నమ్ముతూ వచ్చారు. దీంతో వైసీపీ మరింత దూకుడు పెంచి దానికి కమ్మోళ్ల రాజధాని అని ముద్ర వేస్తే జనాలు దాన్ని కూడా నమ్మారు. కట్ చేస్తే అక్కడున్న కమ్మోళ్ల కంటే రెడ్లు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ అని తీరిగ్గా జనానికి అర్థమైంది.
విజయవాడ, గుంటూరు ప్రాంతం కావడంతో సాధారణంగా అక్కడ కమ్మవారి సంఖ్య ఎక్కువ కావడంతో జగన్ చెప్పే అబద్ధాలను జనం సులువుగా నమ్మేశారు. దీంతో జగన్ గెలుపు సులువైపోయింది. ఇపుడు ఎందుకు ఓటేశాం రా బాబూ అని జనం తలలు పట్టుకుంటున్నారు. ఇపుడిపుడే అమరావతి గురించి వాస్తవాలు బయటకు రావడం జరిగింది.
అలాంటి నిజాలతో కూడిన అమరావతి వాస్తవాలు పుస్తకాన్ని విజయవాడ వేదికగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత తులసిరెడ్డి చేసిన ప్రసంగం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
ఆ స్పీచ్ వినే ముందు స్పీచ్ విన్న నెటిజన్లు చేసిన కామెంట్లు కొన్ని తెలుసుకుంటే మీరు ఆ స్పీచ్ వినకుండా ఉండలేరు.
కొన్ని కామెంట్స్
నేను ఈమధ్య కాలంలో ఇలాంటి speech వినలేదు సార్! ఒక 25 సంవత్సరాల క్రితం ఇలాంటి స్పీచ్ విన్నాము. మళ్ళీ ఇప్పుడు. మీరు చాలా బాగా విషధీకరించారు. Great సర్!👌👌
చాలా రోజుల తర్వాత ఒక నాయకుడు భూతులు లేకుండ స్వచమైన ప్రసంగం వింటున్నాము.. సూపర్ స్పీచ్ sir, మీ లాంటి నాయకులు మన ఆంధ్రప్రదేశ్ కి చాలా అవసరం..