వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సీతమ్మవారికి తాళి కట్టి చిక్కుల్లో పడ్డారు. హిందూ సమాజం ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2024 ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభకు ఎన్నికైన విరూపాక్షి.. శనివారం శ్రీరామనవమి సందర్భంగా స్వగ్రామం చిప్పగిరిలో నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. అయితే అక్కడ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు వివాదాస్పదం అయింది.
సంప్రదాయం ప్రకారం.. సీతారాముల కళ్యాణంలో అర్చకులు శ్రీరాములవారి తరుపున సీతమ్మ మెడలో మంగళసూత్రాన్ని వేస్తారు. అయితే చిప్పగిరిలో నిర్వహించిన కళ్యాణంలో అపచారం జరిగింది. వేద పండితులు కట్టాల్సిన తాళిని విరూపాక్షి సీతమ్మవారికి కట్టేశారు. మాంగల్యాన్ని తాకి ఇవ్వమని ఎమ్మెల్యే విరూపాక్షికి పండితులు తాళిని అందజేశారు. అయితే విరూపాక్షి తాలిని కళ్ళకు అద్దుకోవాల్సింది పోగా.. సీతమ్మ మెడలో నేరుగా కట్టేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేని పండితులు అడ్డుకోకుండా అక్షింతలు వేయడం గమనార్హం.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఆలూరు ఎమ్మెల్యే తీరు పట్ల హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతమ్మ మెడలో వేద పండితులు వేయాల్సిన తాళిని విరూపాక్షి ఎలా కడతారంటూ హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో తప్పు గ్రహించిన ఎమ్మెల్యే విరూపాక్షి వెంటనే క్షమాపణలు చెప్పారు. తనకు తానుగా ఆ పని చేయాలేదని.. పండితులు కట్టమంటేనే సీతమ్మ మెడలో తాళి కట్టానని వివరణ ఇచ్చారు. ఈ మేరకు సారీ చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు.
ఫ్లాష్..ఫ్లాష్..
శ్రీరామ నవమి వేడుకల్లో శనివారం చిప్పగిరి మండలం లో జరిగిన వేడుకల్లో సీతమ్మ కు తాళి కట్టిన ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి…
* ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్న హిందూ సమాజం
* సీతమ్మకు తాళి ఎలా కడుతాడంటూ తప్పు బట్టిన హిందూ సమాజం.. pic.twitter.com/nClUOggClr— వేగుచుక్క
(@vegu_chukka) April 7, 2025