బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్, రణబీర్ కపూర్లు వివాహబంధంతో ఒక్కటయ్యారు.
కొద్ది మంది అతిథుల మధ్య గురువారం వీరి వివాహం వేడుకగా జరిగింది.
పెళ్లి తరువాత అలియా భట్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తెలుపు, లేత గోధుమ రంగు దుస్తులలో అలియా, రణబీర్‌లు మెరిసిపోయారు. ముత్యాల హారాలు, ఖరీదైన నగలలో అలియా అభిమానులకు కనువిందు చేశారు.
సినిమాల్లోకి రాక ముందు నుంచే రణబీర్ అంటే తనకు ఇష్టమని అలియా అనేక సందర్భాలలో చెప్పారు.
రాక్ స్టార్ సినిమా తరువాత ఓ కార్యక్రమంలో తొలిసారి రణబీర్‌తో మాట్లాడిన అలియా ఆ తరువాత పూర్తిగా అతని ప్రేమలో మునిగిపోయింది.
ఆ తరువాత బ్రహ్మాస్త్ర సినిమాలో రణబీర్ సరసన నటించింది కూడా.
గత అయిదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.