30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్ ఈ మధ్య కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతున్నారు. ఒకప్పుడు వైసీపీలో ఉన్న పృథ్వీ ఇప్పుడు అదే పార్టీకి యాంటీగా మారారు. ఇటీవల విశ్వక్ సేన్ `లైలా` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైసీపీరి ఉద్దేశించి పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి వివాదం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైసీపీ నేతలు పృథ్వీపై విరుచుకుపడ్డారు. ఏకంగా బాయ్ కాట్ లైలా అంటూ ట్రెండ్ చేశారు. కారణం ఏదైనప్పటికీ లైలా ఫ్లాప్ అయింది.
అయితే వివాదం చల్లబడుతుండగానే మరోసారి వార్తల్లోకి వచ్చాడు పృథ్వీ రాజ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సాంగ్ పాడారు. బ్లాక్ బస్టర్ మూవీ `రంగస్థలం`లోని సాంగ్ లిరిక్స్ కు బదులుగా తన సొంత లిరిక్స్ ను జోడించి జగన్ ను పృథ్వీ ట్రోల్ చేశారు. `ఈ చేతితోనే పథకాలు పెట్టాను.. ఈ చేతితోనే డబ్బులు పంచాను.. ఈ చేతితోనే బటన్లు నొక్కాను.. ఈ చేతితోనే రాష్ట్రాన్ని దోచాను.. ఇన్ని చేసిన నాకు పదకొండే ఇస్తారా.. ఓరయ్యో నా అయ్య` అంటూ జగన్ ఉద్ధేశించి పృథ్వీ పాట పాడారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంలో.. ఇదెక్కడి మాస్ ర్యాగింగ్ రా బాబు అంటూ నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. మరి వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇకపోతే తాజాగా పృథ్వీ రాజ్ ట్విట్టర్ (ఎక్స్) లోకి ప్రవేశించాడు. తన భావాలను స్టేజ్ పైనా ప్రకటిస్తుంటే కొద్ది మంది ఫీల్ అవుతున్నారని.. కాబట్టి ఇక నుండి ట్విట్టర్ ద్వారా తెలియపరుస్తానని పృథ్వీ పేర్కొన్నాడు.
మళ్ళీ వచ్చేశాడు
ఈ పాట రిలీజ్ చేస్తే @ysjagan కి బ్రేక్ ఇస్తాం
2029లో 9 వచ్చేలా చేస్తాం pic.twitter.com/n6iDmtiUn2
— BoyFromBezawada (@GoCoronaGo) February 21, 2025