ఏపీ లో వరుణుడు విలయతాండవం చేయడంతో వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. విజయవాడ నగరం సగానికి పైగా మునిగిపోయింది. అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం.. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడంతో.. అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద బాధితులకు ఆహారం సరఫరా చేయడం సవాలుగా మారవడంతో.. డ్రోన్ల సహాయం తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ వరద బాధితులకు అండంగా ఉండేందుకు `ఆయ్` మూవీ టీమ్ ముందుకు వచ్చింది. ఆర్థిక సాయం అందించబోతున్నట్లు వెల్లడించింది.
ఆగస్టు 15న విడుదలైన ఆయ్ సినిమా పాజిటివ్ టాక్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ థియేటర్స్ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే ఈ రోజు(సెప్టెంబర్ 2) నుంచి వీకెండ్ వరకు వచ్చే కలెక్షన్లలో నిర్మాత షేర్లోని 25 శాతాన్ని జనసేన పార్టీ తరుపున విరాళంగా అందజేయనున్నట్లు ఆయ్ మూవీ నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు. దీంతో గొప్ప నిర్ణయం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా, గోదావరి బ్యాక్డ్రామ్ లో తెరకెక్కిన ఆయ్ చిత్రంలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించారు. నయన్ సారిక హీరోయిన్ గా నటించగా.. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించారు. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వంటి పెద్ద సినిమాలతో పోటీ పడుతూ బరిలోకి దిగిన ఆయ్.. ప్రేక్షకుల నుంచి సానుకూల సమీక్షలను సొంతం చేసుకుంది.