ఇండియాను గడగడలాడిస్తున్న డబుల్ మ్యూటెంట్ (B.1.617) కు తోడు ఇపుడు మరో దారుణమైన మరింత ప్రమాదకరమైన వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
హైదరాబాద్ మరియు ఘజియాబాద్ పరిశోధకుల బృందం కరోనావైరస్ యొక్క డేంజరస్ కొత్త మ్యూటెంట్ ‘N440K‘ ను కనిపెట్టారు. ఇది ఇప్పుడు చెలామణిలో ఉన్న కోవిడ్ మ్యూటెంట్ల కంటే 10 నుండి 1,000 రెట్లు ఎక్కువ వేగంగా వ్యాపిస్తోంది అని, ప్రమాదకరమైనది అని తేల్చారు.
దీనిని ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నగరంలోని బాధితుల్లో కనిపించింది. అయితే, దురదృష్టవశాత్తూ N440K ఇప్పటికే దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడింట ఒక వంతు అంటువ్యాధులు ఈ వేరియంట్ వల్ల సంభవిస్తున్నాయి అని చెబుతున్నారు.
ఈ పరిశోధన అధ్యయనంలో హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎమ్‌బి) మరియు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని అకాడమీ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (ఎసిఎస్ఐఆర్) శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.