• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

lock down: సుప్రీం కోర్టు ఏమంటోంది?

admin by admin
May 3, 2021
in Around The World, India, Top Stories
0
0
SHARES
221
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కరోనా శృతి మించింది. కట్టడి కోసం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లాక్​డౌన్ గురించి ఆలోచించండి. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చేసిన సూచన.

జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విధంగా సూచించింది.

అపుడేమో అవసరం కంటే ముందు లాక్ డౌన్ పెట్టారు. అపుడు లేట్ పెట్టారని అన్నందుకు ఇపుడు దాని గురించి ఆలోచించడమే మానేశారు.

అంతే కాదు సుప్రీంకోర్టు మరిన్ని సూచనలు చేసింది. లాక్​డౌన్ విధిస్తే పేదల ఇబ్బందులు తీర్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.  ప్రాణవాయువు కొరత నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్‌ అదనపు నిల్వలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది.

ఆక్సిజన్ సరఫరా గురించి సుప్రీం కోర్టు ఏమందంటే…

★ వాటిని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం నిర్వహించాలి.
★ దేశవ్యాప్తంగా వికేంద్రీకరించాలి.
★ వచ్చే నాలుగు రోజుల్లో అత్యవసర నిల్వలను ఏర్పాటు చేయాలి.
★ రాష్ట్రాల కేటాయింపులకు అదనంగా ఈ నిల్వలను నిర్వహించాలని స్పష్టం చేసింది.

మిగతా విషయాలపై ఏం చెప్పిందంటే….

★ “ప్రజల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్‌ విధించే అవకాశాన్ని పరిశీలించండి. లాక్‌డౌన్‌ వల్ల తలెత్తే సామాజిక, ఆర్థిక ఇబ్బందుల గురించి మాకు అవగాహన ఉంది. ముఖ్యంగా పేదలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తెలుసు. అందువల్ల లాక్‌డౌన్‌ విధించేట్లయితే ఈ వర్గాల అవవసరాలు తీర్చడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి” – సుప్రీం ధర్మాసనం.
★ ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రయోజనాల కోసం పలు సూచనలు, సలహాలు ఇచ్చింది సుప్రీం.
★ వివిధ అంశాలపై సమాచారాన్ని కోరింది.
★ సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం ఆదివారం రాత్రి ఇందుకు సంబంధించిన లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.
◆ సామూహిక సమావేశాలు, సభలు, వైరస్‌ని సూపర్‌స్ప్రెడర్‌గా వ్యాపింపజేసే కార్యక్రమాలపై కఠిన నిషేధం విధించాలి.
◆ రూ.50 లక్షల కరోనా బీమా వర్తించిన 22 లక్షల మంది వైద్య ఆరోగ్య సిబ్బందిలో ఇప్పటి వరకు మరణించిన వారికి సంబంధించిన 287 క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ పథకం కింద ఇంకా ఎన్ని క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి, వాటిని ఎంత కాలంలో పరిష్కరిస్తారు?
◆ కొవిడ్‌ సోకిన వైద్య ఆరోగ్య సిబ్బందికీ సరైన పడకలు, ఆక్సిజన్‌, అత్యవసర మందులు దొరకడం లేదని తెలిసింది. మరికొందరిని పాజిటివ్‌గా తేలిన పది రోజుల్లోపే విధులకు రమ్మని ఒత్తిడి చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టిన వైద్యుల సేవలను గుర్తించేందుకు వీలుగా జాతీయ స్థాయిలో ఒక విధానం రూపొందించాలి. వారికి ప్రోత్సాహకాలు ప్రకటించాలి.
◆ ఆరోగ్యానికి ముప్పు కలగకుండా విధులు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిందీ తెలియలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని పరిష్కరించాలి.
◆ వైద్య సిబ్బందికి అవసరమైన ఆహారం, పని విరామ వేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి స్థలం, రవాణా సౌకర్యం అందించడం, కొవిడ్‌కు గురైనప్పుడు జీతాలు, సెలవుల్లో కోతలు విధించరాదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక సమయం విధులు నిర్వహించిన వారికి ఓవర్‌టైం అలవెన్స్‌ ఇవ్వాలి.
◆ మహమ్మారి నియంత్రణ కోసం ఇప్పటి వరకు ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పాలి.
◆ ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా అర్థించే వారిని అధికార యంత్రాంగం వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ విషయం అధికార యంత్రాంగానికంతటికీ తెలిసేలా ప్రతి జిల్లా కలెక్టర్‌కు పంపాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
◆ ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోవడానికి అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం రెండు వారాల్లోపు ఒక జాతీయ విధానాన్ని ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అనుసరించాలి. కేంద్ర ప్రభుత్వం అలాంటి విధానం ఖరారు చేసేంత వరకూ స్థానిక చిరునామా లేదనో, గుర్తింపుకార్డు లేదనే కారణంతో రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోకుండా నిరాకరించడానికి కానీ, అత్యవసర మందులు తిరస్కరించడానికికానీ వీల్లేదు.
◆ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టిన కార్యాచరణను, ప్రొటోకాల్స్‌ను పునఃసమీక్షించాలి. ఆక్సిజన్‌ లభ్యత, వ్యాక్సిన్ల అందుబాటు, వాటి ధరలు, అందుబాటు ధరల్లో అత్యవసర మందుల లభ్యతతో పాటు, ఈ ఆర్డర్‌లో పేర్కొన్న అన్ని అంశాలపైనా కేసు తదుపరి విచారణ జరిగే 10వ తేదీ లోపు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన అఫిడవిట్లు అన్నింటినీ అమికస్‌క్యూరీకి ముందుగా అందించాలి.

Tags: Coronacorona vaccinecovaxin vaccinecovidCovid 19covishield vaccinelock downsputnik v
Previous Post

covid : కర్నూలులో 10 రెట్లు వేగంగా వ్యాపించే ఎన్440కే మ్యూటెంట్ !!

Next Post

బ్రేకింగ్ – సబ్బంహరి కన్నుమూత

Related Posts

Andhra

అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం

July 5, 2022
Movies

పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?

July 5, 2022
Trending

బ్రేకింగ్:రఘురామపై మరో కేసు

July 5, 2022
Trending

37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

July 5, 2022
Movies

‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత

July 5, 2022
Trending

నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట

July 5, 2022
Load More
Next Post

బ్రేకింగ్ - సబ్బంహరి కన్నుమూత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ
  • ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత
  • నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట
  • చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా
  • కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !
  • శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్ర‌యంలో సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ దంప‌తుల‌కు ఘ‌న వీడ్కోలు
  • ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్
  • యథా రాజా.. తథా పోలీసు!
  • ఆ హిందువుల ఊచకోతపై సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
  • జగన్ గుడ్డోడు…లోకేశ్ అంత మాటెందుకున్నారంటే…
  • అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

యథా రాజా.. తథా పోలీసు!

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra