అమరావతి: ఒక గంట, రెండు గంట ల పడిన వర్షం కాదు ఏకంగా 48 గంటల పైగా రాష్ట్ర వ్యాప్తంగా గా దట్టం గా కమ్మిన మేఘాలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎక్కడ క్షణం ఆలస్యం చేయకుండా జరుగుతున్న సహాయక చర్యలు…ఎక్కడకి అక్కడ అధికార యంత్రాంగం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉన్నారు.
రాష్ట్ర రాజధాని అమరావతిలో, రాజధాని చుట్టుపక్కల కూడా భారీ వర్షం కురుస్తుంది. ఉరవళ్ళ, పరవళ్ల తో పక్కన కృష్ణమ్మ ప్రళయ భీకరంగా పరుగులిడుతున్నా రాష్ట్ర రాజధాని అమరావతి మునగ లేదు. ఎక్కడ ఒక్క ఊరు మునగలేదు… ఒక్క రోడ్డు కొట్టుకు పోలేదు… పశు సంపద నష్టం కానీ ప్రజల ప్రాణాపాయ నష్టం కానీ ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు.
2008 సం.లో ఇలానే భారీ వర్షాలు, వరదలు వచ్చి నపుడు కర్నూలు జిల్లా వ్యాప్తంగా మునిగింది. దాదాపు వరదల్లో పదిహేను మంది మరణించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో పదిహేను మంది చనిపోయారు. వేలాది పశువులు మృత్యువాత పడ్డాయి. వేలాది మంది కర్నూలు ఊరు వదలి వేరే చోట్లకు వలస వెళ్లి పోయారు.
ప్రకృతి విలయ తాండవం చేసినపుడు ఎవరేమి చేయగలరు..? బాధ్యతగా సహాయ సహకారాలు అందించడం తప్ప… సామాన్య ప్రజలకు, వరద లో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేయడంలో ముందంజలో ఉండడం తప్ప. ఇలాంటి ఉప్పెనలు , సునామీ లు ఎన్నెన్నో ఎదురుకున్న పరిస్థితి మన తెలుగు వాళ్లది. హుదూద్ లాంటి విధ్వంసకరమైన తుఫానులు వచ్చినప్పుడు నడి రోడ్డు పై తిష్ట వేసుకుని కూర్చుని చంద్రబాబు నాయుడు సమస్యలను వేగవంతంగా పరిష్కరించి క్లిష్ట పరిస్థితుల్లో పరిస్థితులను ఎలా అధిగా మించాలో దారి చూపారు.
కొందరు కిరాయి గాళ్ళు రాష్ట్రం పై కోపం పగ పెంచుకొని మరల అమరావతి మునిగింది, మునుగుతుంది అంటూ విష ప్రచారం చేస్తున్నారు. రాజధాని విషయం లో అక్కసు కక్కుతున్నారు. గత ప్రభుత్వం లో ఎన్నో దారుణ పరిస్థితులు చూసి కూడా ఏనాడూ నోరు మెదపని పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి… ప్రజలు పట్టుమని 11 సీట్లు ఇచ్చి బుద్ది చెప్పిన తన వంకర బుద్ది మార్చుకోక పోవడం శోచనీయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా.. రాష్టాన్ని, రాష్ట్ర ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు అనుక్షణం ఆలోచన చేస్తున్నారు.