2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఓవైపు ప్రజా సంక్షేమం మరోవైపు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించిన చంద్రబాబు తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు హయాంలో నేడు తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు స్వయంగా తన చేతులతో ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. ప్రజల నుంచి వినతులు స్వీకరణ విషయంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా కాకుండా టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్తగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను విడుదల చేశారు.
ప్రతి శనివారం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో వినతులు తీసుకుంటున్నారు. అయితే ఆ సమయంలో ఫోటోల కోసం వచ్చే వారి వల్ల నిజమైన సమస్యలతో వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఇబ్బంది పడకుండా ప్రజలు వారి సమస్యలను 7306299999 నంబర్ కి ముందుగా ఫోన్ చేసి తెలియచేస్తే.. ప్రయారిటీ ప్రకారం సమస్యలతో వచ్చే వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసేలా చేస్తారు. తాజాగా ఈ విషయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. సో.. చంద్రబాబును కలిసి మీ సమస్యల గురించి నేరుగా వివరించాలనుకుంటే పైన నెంబర్ కు కాల్ చేయండి.
ప్రతి శనివారం చంద్రబాబు గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో వినతులు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫోటోల కోసం వచ్చే వారితో, నిజమైన సమస్యలతో వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఇబ్బంది పడకుండా, మాకు ముందుగా ఫోన్ చేసి తెలియచేస్తే, ప్రయారిటీ ప్రకారం సమస్యలతో వచ్చే వారిని ముఖ్యమంత్రి గారు… pic.twitter.com/RfC1YiWLgg
— Telugu Desam Party (@JaiTDP) June 30, 2024