అవును.. ఈ మాట ఇప్పుడు ఏపీ బీజేపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు వైసీపీని టార్గెట్ చేసిన వారు.. ఫైర్ బ్రాండ్స్‌గా గుర్తింపు దెక్కించుకున్నవారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. దీనికి కార ణం.. నిన్న మొన్నటి వరకు ఏపీ బీజేపీ ఇంచార్జ్‌గా ఉన్న సునీల్ దేవ్ ధర్.. అధికార పార్టీ వైసీపీ నేతలతో చేతులు కలిపి.. సర్కారుకు అనుకూలంగా ఉన్నారనే విమర్శలు ఉన్నాయి.
అంటే.. ఏపీలో బీజేపీని పరుగులు పెట్టించాలన్న వ్యూహానికి .. ఒక రకంగా.. ఏపీ వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న సునీల్ దేవ్‌ధర్.. ఎక్కడికక్కడ తన అడ్డుపుల్లలు వేస్తూ.. పార్టీకి ప్రతిబంధకంగా మారారనే వాదన ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఈయనను పక్కన పెట్టారు. కేంద్ర బీజేపీ జాతీ య కార్యవర్గంలో కార్యదర్శిగా ఉన్న సునీల్ దేవ్‌ధర్‌ను పక్కన పెట్టారు. దీంతో ఏపీ ఇంచార్జిగా కూడా.. దేవధర్ ప్రాభవం కోల్పోయారనే చెప్పాలి.
ఈ క్రమంలో తాజాగా దక్షిణాది నుంచి కేంద్ర బీజేపీ కమిటీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఎంపీ బండి సంజయ్‌కు అవకాశం ఇచ్చారు. ఈయన దూకుడు ఎలా ఉంటుందో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. ప్రభుత్వంపై నువ్వానేనా అన్నట్టుగా సాగించే రాజకీయాలకు కేరాఫ్ అని అనిపించుకున్నారు. పాదయాత్ర నుంచి ప్రభుత్వంపై నిప్పులు చెరిగే వరకు ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగారు.
ఈ నేపథ్యంలోనే విధేయతకు వీరతాడు అన్నట్టుగా బండి సంజయ్‌కు పార్టీ అధిష్టానం.. జాతీయ కార్యవ ర్గంలో చోటు దక్కింది. ఇక, మరోవైపు.. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌గా కూడా బండికి ఛాన్స్ ఇస్తున్నా రనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. సునీల్ విఫలమైన నేపథ్యంలో బలమైన గళం ఉన్న బండి వంటివారికి ఏపీలో బాధ్యతలు అప్పగించడం ద్వారా.. వైసీపీకి చెక్ పెట్టేందుకు.. రాజకీయంగా పార్టీని డెవలప్ చేసేందుకు మరింత అవకా\శం ఉంటుందని కమల నాథులు లెక్కలు వేసుకోవడం గమనార్హం.