ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను కొనసాగిస్తామని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యా నించారు. ప్రస్తుతం మూడు ముక్కల ముఖ్యమంత్రి జగన్ కొన్ని పథకాలు అమలు చేస్తున్నారని.. వాటిని తాము కూడా అమలు చేస్తామని చెప్పారు. అయితే.. ఆయా పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న మొత్తాలను లెక్కలేసి మరీ పవన్ చెప్పుకొచ్చారు.
అమ్మ ఒడి కింద ఏడాది రూ.15 వేలు ఇస్తున్నారని, కానీ, రోజు కు 35 రూపాయలుగా ఉందని, వాహన మిత్ర కింద ఆటో కార్మికులకు రూ.10 వేలు ఇస్తున్నారని.. ఇది రూ.27గా ఉందని.. ఈ మాత్రం సొమ్ముకే ఓటును అమ్ము కోవద్దని పవన్ విన్నవించారు. తమ ప్రభుత్వం వస్తే.. ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేస్తామని.. ముఖ్యంగా శ్రీకాకుళంలో కొబ్బరి తోటల సాగును, జీడి సాగును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటు, ఉపాధికల్పనకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. తాము నిలబడతామని, రాజకీయాల్లో కొనసాగుతానని.. పవన్ చెప్పారు. ప్రజలు కూడా తమ వెంట నిలబడాలని.. ప్రజలు తన వెంట నిలబడకపోతే.. ఏమీ చేయలేనని తెగేసి చెప్పారు. రేపు సమస్యలతో తన వద్దకు వచ్చినా.. తాను చేసేది ఏమీ ఉండదని చెప్పారు. ఈ సారి కూడా తమకు అండగా నిలవకపోతే.. తన వద్దకు రావాల్సిన అవసరం లేదన్నారు.
ఈ సారి కూడా మీరు మారకపోతే.. మరోఐదేళ్లు ఎగిరిపోతాయని అన్నారు. పోలీసులతో ఇంత ఊడిగం చేస్తున్నప్పటికీ.. వారికి ఇవ్వాల్సిన టీఏలు, డీఏలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం ఒక్కొక్కరికీ లక్షా.50 వేల చొప్పున బాకీ ఉందన్నారు. “నేను ఇస్తున్న గట్టి హామీ.. ఏంటంటే.. గత ఎన్నికల్లో 6.9 శాతం ఓటు బ్యాంకు లభించింది. 15 నుంచి 19 లక్షల ఓట్లు వచ్చాయి. అవన్నీ ఒకే చోట వచ్చి ఉంటే.. జనసేన అభ్యర్థులు అసెంబ్లీలో ఉండేవారని చెప్పారు.
మూడు ముక్కల ముఖ్యమంత్రి @ysjagan ????#JanaSenaYuvaShakti pic.twitter.com/9p2TtuRk7r
— Trend PSPK (@TrendPSPK) January 12, 2023