2019 వరకు అమరావతికి జై కొట్టిన ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులకు 2020లోనే ఉత్తరాంధ్రకు రాజధాని ఉంటే అభిరుద్ధి అవుతుందని గుర్తు వచ్చిందా? లేకపోతే విశాఖ రాజధాని అని హడావుడి చేసి అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేసి కమిషన్ ఇస్తామన్న కొందరు పెద్దల ట్రాప్ లో పడ్డారో అర్థం కావడం లేదు.
మరి ఈరోజు ఇన్నికబుర్లు చెప్పే ఈ నేతలు… ఇంత సీనియర్లు 2015లో అమరావతి ప్రకటించినపుడు ఎందుకు విశాఖను రాజధాని చేయండి అని డిమాండ్ చేయలేదో చెప్పాలి. అంటే ఇపుడు సీఎం జగన్ నాటకంలో భాగంగానే వీరు డిమాండ్ చేస్తున్నట్టు స్పస్టంగా అర్థమైపోతోంది. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీతో ఉండటం లేదు.
వైసీపీ మోసాన్ని గుర్తించిన ఉత్తరాంధ్ర ప్రజలు ఇపుడు వైసీపీకి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు.
అయ్యా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ MLA, MP లు, విశాఖ మీద 2014-2019 వరకు చూపని, ఇప్పుడు కారిపోతున్న ఎనలేని ప్రేమ చూపిస్తున్న మీకు ధన్యవాదములు.
ఇదే ప్రేమ,
1) విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ మీద ఎక్కడ
2) ప్రత్యేక హోదా మీద ఎక్కడ ,
3) రైల్వే జోన్ మీద ఎక్కడ మీ ప్రేమ,
4) 2014 లో రాజధాని ని విజయవాడ గుంటూరు మధ్యలో అయితే నేను ఒప్పుకుంటున్న అని జగన్ చెప్పినప్పుడు, వైజాగ్ కి అన్యాయం చేస్తున్నప్పుడు ప్రేమ ఎక్కడ,
4) 30000 ఎకరాలు ఒకేచోట ఉండేలా, అన్ని ప్రభుత్వం భావనలు ఒకేచోట ఉంటేనే రాజధాని అవుతుంది అని అన్న జగన్ కి అవగాహన లేదా? మీకు అవగాహన లేదా?
5) నీకు ని జగన్ ని మెప్పించడానికోసం రాజీనామా అంటున్నారు అలాగే గర్జన అంటున్నారు ,
7) ఇదంతా మీ రాజకీయ లబ్ది కోసం ప్రాంతాల మధ్య విద్వేషాలు రేపుతున్నారు.సినిమా డైలాగ్ లు చెప్తున్నారే కానీ ఒక్కడు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం మాట్లాడలేదు