ఓ వైపు పర్యావరణానికి విఘాతం చేసే పనులు చేస్తూనే, మరోవైపు ప్రకృతినీ, నేల తల్లినీ కాపాడుకోవడం మన వంతు, మన బాధ్యత అంటూ చెప్పడంలో అర్థం ఏంటో ఆయనకే అర్థం కావాలి. ఆయనే వీటి అర్థ పరమార్థాలు వివరిస్తూ పోవాలి. అర్థం వెనుక అర్థ మరియు ఆంతర్యం చెబితే వినిపించుకోవాలి. విని ఆనందించాలి. ఇదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ చైర్మన్, విశాఖ రీజనల్ కో ఆర్టినేటర్ వైవీ సుబ్బారెడ్డి చెప్పిన మాటలు.
రుషి కొండ తవ్వకాలపై కానీ సంబంధిత చట్ట విరుద్ధ చర్యలపై కానీ ఎవ్వరు ప్రశ్నించినా అవన్నీ అబద్ధాలు, తప్పులు, అనైతికాలు అని చెప్పే మనుషులు ఇప్పుడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడంంలో ఆంతర్యం ఏంటన్నది వారికే తెలియాలి అని టీడీపీ కౌంటర్లు ఇస్తోంది.
నేలను కాపాడడం, అడవుల నరికివేతను అడ్డుకోవడం, విస్తృత రీతిలో పర్యావరణ హితం కోరి మొక్కలు పెంచడం, ప్రకృతి వనరులను అడ్డ దారుల్లో తరలించకుండా అడ్డుకోవడం ఇవన్నీ చేయగలిగితే అప్పుడు వైవీ ఏం చెప్పినా విని సంతోషించాలి. నదీ గర్భాలు కుచించుకుపోయినా, ఇసుక తవ్వకం మరియు తరలింపు పేరిట నిబంధనలు అతిక్రమించినా ఇవన్నీ కూడా అడ్డుకునే వారే లేనప్పుడు శుభాకాంక్షలు చెప్పి ఏం సాధిస్తారు అని!
ఓ వైపు పీసీబీ అనగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మరోవైపు ఎన్ జీ టీ అనగా నేషనల్ గ్రీన్ కోర్ ట్రైబ్యునల్ వంటివి ఉన్నా అవేవీ చేయలేకపోతున్నాయి. చేష్టలుడిగి చూస్తున్నాయి. దేర్ ఆర్ హెల్ప్ లెస్. అవి ఏమీ చేయలేకపోతున్నాయి కనుకనే ప్రభుత్వాలు మరియు నాయకులు ఇష్టా రాజ్యంగా ఊగిపోతున్నారని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీటీడీకి సంబంధించి వైవీ ఏమన్నారో చూడండి…
“గ్లోబల్ వార్మింగ్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యం అవుతుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఈ నెల 1వ తేదీ నుంచి కొండమీద హోటళ్లు, ఇతర దుకాణాల్లో కూడా ఏ రూపంలో కూడా ప్లాస్టిక్ వాడరాదని ఆదేశాలుజారీ చేసి అమలు చేస్తున్నాం. అదేవిధంగా అలిపిరి టోల్ గేట్ వద్ద తనిఖీలు చేసి వాటర్ బాటిళ్లు తీసేస్తున్నారు. భక్తులు కూడా ఇందుకు సహకరించాలి. తిరుమల లో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభించాం. త్వరలోనే ఆర్టీసీ 100 విద్యుత్ బస్సులు నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో తిరుమలకు విద్యుత్ వాహనాలను మాత్రమే అనుమతించే ఆలోచన చేస్తున్నాం.‘‘
శ్రీవారి ప్రసాదాల కౌంటర్లలో ప్లాస్టిక్ బ్యాగ్ లు నిషేధించాం. వీటి స్థానంలో జ్యుట్, పర్యావరణానికి హాని కలిగించని బ్యాగ్ లు అందుబాటులో తీసుకువచ్చాము. నేల తల్లిని కాపాడుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇందులోభాగంగా రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాం.
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో రైతు సాధికార సంస్థ తో ఒప్పందం చేసుకుని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా సాగుకు నోచుకున్న శెనగలు, బియ్యం తో పాటు రసాయిన రహిత బెల్లంను టీటీడీ కొనుగోలు చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యావరణ హిత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తాం. తిరుమలలో 10 వేల మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నాం..” అని చెప్పారాయన.
ఉత్తరాంధ్రకు ఇన్ ఛార్జిగా ఉన్న సుబ్బారెడ్డి గారూ…. మీరు ఇన్ని కబుర్లు చెబుతున్నారు కదా… మరి దీని సంగతేంటి?
ఋషి కొండ ప్రాజెక్టు వల్ల పర్యావరణ ధ్వంసం అయ్యే పరిస్థితులు లేవు.కొండ చుట్టూరా తవ్విన ప్రాంతంలో ఉన్నవి చెట్లు,వృక్షాలు కాదు.పిచ్చి మొక్కలు.నిజం చెప్పాలంటే ప్రాజెక్టు పూర్తైన తర్వాత కొండ మీద గ్రీనరీ ఇంకా పెరుగుతుంది.మొదటి ఫోటో విశాఖ నగరం పై విషం కక్కుతున్న iTDP ది.రెండవ ఫోటో నాది. pic.twitter.com/j8k3YKvXme
— Dr. K. Srinivasa Varma (@DrKSVarma) June 4, 2022
https://twitter.com/rajeshpk43/status/1533654322432471041
అయ్యన్న ఆన
జగన్ రెడ్డి: రుషికొండని అలా మింగేశావేంటి మామా!
విసారెడ్డి : కొండకి కిమ్ హెయిర్‌స్టైల్ చేయించా అల్లుడూ.. pic.twitter.com/SFpbojsjyh— Ayyanna Patrudu (@AyyannaPatruduC) June 5, 2022