ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కార్పొరేటర్లు మొదలుకుని ఎంపీల వరకు ఒకరు తర్వాత ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. నిన్నటకు నిన్నే జగన్ కు నమ్మిన బంట్లుగా ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు తమ రాజ్యసభ సభ్యత్వానికి మరియు పార్టీకి ఏకకాలంలో రాజీనామా చేశారు.
ఈ షాక్ నుంచి తేరుకోక మునుపే జగన్ కు ఇంకొక ఎదురు దెబ్బ తగిలింది. నేడు వైసీపీ నుంచి మరో ఇద్దరు ఔట్ అయ్యారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి పార్టీని వీడారు. వీరిద్దరూ మండలి ఛైర్మన్ ను కలిసి రాజీనామా లేఖలు సమర్పించారని తెలుస్తోంది. అలాగే త్వరలో కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి టీడీపీలో చేరబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.