ఎస్! ఇందుమూలంగా.. వైసీపీకి చాలానే తెలిసి వచ్చిందని అంటున్నారు పార్టీ నాయకులు. ఏదైనా.. పైపైన చూడడం.. ఎవరో చెబితే వినడం.. వంటివి పెట్టుకుంటే..వాస్తవాలు ఎప్పటికైనా మరుగున పడతాయి. అదే క్షేత్రస్తాయిలో పర్యటిస్తే.. క్షేత్రస్తాయిలో ప్రజలను కలిస్తే.. అప్పుడు కదా.. వాస్తవాలు బోధ పడేది!!
ఇప్పుడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు.. ఇదే బోధ పడింది. ఇప్పటి వరకు ఎవరు ఎన్ని చెప్పినా.. వ్యతిరేకులు. వైసీపీపై కుట్రలు పన్నుతున్నారు.. అంటూ.. ఎదురు దాడి చేసిన వైసీపీ నాయకు లకు క్షేత్రస్థాయిలో ప్రజాగ్రహం చూసి.. తల్లడిల్లుతున్నారు.
తాజాగా గడప గడపకు పాదయాత్ర కార్యక్రమం పడకేసింది. సీఎం జగన్ ఏపీలో ఉన్నంత వరకు బాగానే సాగిన ఈ కార్యక్రమం ఆయన దావోస్ పర్యటనకు వెళ్లగానే.. ఎవరికి వారు గప్చుప్ అయ్యారు. ఎక్కడికక్కడ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
అంతేకాదు.. ఉత్సాహంగా కూడా ముందుకు సాగడం లేదు. దీనికి కారణం.. ఎక్కడికక్కడ ఎదరవు తున్న నిలదీతలు ఒక కారణమైతే.. సొంత పార్టీ నాయకుల నుంచే అభివృద్ధి జరగడం లేదేనే వాదన వినిపిస్తుండడం మరో కారణం. అయితే.. ఇప్పటి వరకు ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు నెత్తీనోరూ.. కొట్టుకుని చెప్పాయి.
రాజకీయ కోణమే అయినప్పటికీ.. దీనిలోనూ.. ఒక విషయం అయితే.. ఉంది. అభివృద్ది లేదని, రాజధాని అమరావతిని మార్చొ ద్దని.. పారిశ్రామికంగా అభివృద్ది చేయాలని.. రహదారులు వేయాలని.. అప్పులు ఎక్కువగా చేయడం సరికాదని.. సంక్షేమం పేరుతో భారీ ఎత్తున నగదు పంచడం సరికాదని.. ఇలా అనేక సూచనలు టీడీపీ సహా జనసేన, బీజేపీ, కమ్యూనిస్టుల నుంచి వచ్చాయి. అయితే.. వీటిని మాత్రం వైసీపీ కేవలం రాజకీయ కోణంలోనే చూసింది. “ప్రజలకు సంక్షేమం ఆపేయాలని వీరు చూస్తున్నారు!“ అంటూ సాక్షాత్తూ సీఎం జగనే ప్రకటన చేశారు.
ఓకే.. సీఎం జగనే భావించినట్టుగా ఈ సంక్షేమం.. నిజంగానే ప్రజలను అలరిస్తే.. ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? అనేది నేతల ప్రశ్న. అంతేకాదు.. నిజంగానే జగన్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతుంటే.. పయాత్రలకు కానీ.. గడప గడపకు కానీ.. జనాలు ఎందుకు రావడం లేదు? అనేది కూడా ప్రశ్న. ఇలా ఎలా చూసుకున్నా.. ఇప్పుడు క్షేత్రస్తాయిలో పర్యటించడం వల్ల.. వైసీపీ నాయకులు బాగానే తెలిసివస్తోంద.ఇ అయితే.. ఇక్కడ వారికి మేలు చేసే పరిణామం ఒకటి ఉంది.
ముందస్తుకు వెళ్లకుండా.. జాగ్రత్తపడేందుకు.. ఒక మార్గం కనిస్తోంది. అదేసమయంలో మరో రెండేళ్ల సమయం ఉంది కాబట్టి.. ప్రజల నాడి తెలుసుకునివారిని వారుస రిదిద్దుకునే అవకాశం ఏర్పడింది. ఏదేమైనా.. ఇందుమూలంగా వైసీపీ నేతలు తెలిసి వచ్చిందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.