ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు.. నాయకులు కొంత ప్రయత్నాలు చేస్తారు. కొత్త ప్రయ త్నాలు కూడా చేస్తారు. వారిని డబ్బులు ఇవ్వడం, కానుకలు ఇవ్వడం, మద్యం వంటివి ఆఫర్ చేయడం కామనే. అది కూడా ఎన్నికల సమయంలోనే. కానీ, ఇప్పుడు వైసీపీలో ఎన్నికలకు రెండు మాసాల ముం దే.. ఈ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ నుంచి పెనమలూరు నియోజకవర్గం వరకు ఈ తరహా సామ, దాన, భేద, దండోపాయలను తెరమీదకి తెస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్.. వచ్చే ఎన్నికలకు సంబంధించి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న సిట్టింగులను మార్చుతున్నారు. వారిని వేర్వేరు నియోజకవర్గాలకు బదలీ చేశారు. అయితే.. ఆయా నియోజకవర్గాల్లో సీట్లు దక్కని కొందరు ముభావంగా ఉంటుంటే.. మరికొందరు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. అయితే.. వీరిని కూడా కలుపుకొని పోయే బాధ్యతలను సీఎం జగన్.. ఇంచార్జ్లపైనే పెట్టారు. వీరిలో కొందరు సిట్టింగులను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు.
ఉదాహరణకు విజయవాడ సెంట్రల్లో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఇక్కడ టికెట్ దక్కించుకున్న పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మచ్చిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మల్లాదివిష్ణు.. కార్పొరేటర్లకు బాకీ ఉన్న సొమ్మును తాను చెల్లిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో మల్లాది కొంతశాంతించారని సమాచారం. ఇక, వలంటీర్లన కూడా మల్లాది మచ్చక చేసుకుంటున్నారు. వారికి.. కానుకలు ఇస్తున్నారు. నగదు రూపంలో కొందరికి.. ఇతర ఖరీదైన వస్తులను కానుకగా ఇచ్చి మరికొందరిని ఆకట్టుకుంటున్నారు.
కాదూ కూడదు.. అని కార్యకర్తలు ఎవరైనా ఎదురు తిరిగితే.. వారిపై పాత కేసులు తీయిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తంగా వెల్లంపల్లి ఒక కొలిక్కి వస్తన్నారు. ఇక, పెనమలూరు నియోజకవర్గం టికెట్ దక్కించుకున్న మంత్రి జోగి రమేష్ కూడా.. ఫక్తు ఇదే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. స్థానికంగా వలంటీర్లకు ఆయన కూడా కానుకలు ఇస్తున్నారు.అంతేకాదు.. ప్రజలను ఆకట్టుకునేందుకు వారి ఇళ్లలో జరిగే వేడుకల ఖర్చును ఆయనే భరిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. భోజనాలు; షామియానా ఖర్చులు వంటివాటిని జోగి ఇస్తున్నారట. ఇలా.. మొత్తానికి వైసీపీ లో కొత్త పోకడ ఎన్నికలకు ముందే చోటు చేసుకోవడం గమనార్హం.