వైఎస్ కుమార్తె.. తెలంగాణలో రాజన్న రాజన్న తెస్తానంటూ.. పార్టీ పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైటీ పీ) అధ్యక్షరాలు.. షర్మిలలో అసహనం కట్టలు తెగుతోందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఆమె తనను అరెస్టు చేయాలంటూ.. బేడీలు చూపించి మరీ.. ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎంకు సవాల్ విసిరా రు. అయితే.. ఇవన్నీ.. ఉడత సవాళ్లే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఆమె చాలా ఎక్కువగానే తన పాదయాత్రపై ఊహలు పెంచుకున్నారు.
తన పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వస్తుందని అనుకున్నారు. అయితే.. ఎలాంటి స్పందనా రావడం లేదు. దీంతో తిరిగి తిరిగి కాళ్లు నొప్పి వస్తున్నాయని నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు.పైగా..ఆమె పాదయాత్ర కవరేజీ కూడా తగ్గిపోయింది. దీంతో ఏదో ఒకటి చేసి.. మీడియాలో ఉండాలని అనుకుంటు న్న షర్మిల.. తాజాగా… గతంలో ఎప్పుడో మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన మంగళవారం మరదలు డైలాగును పట్టుకుని.. ఊరేగుతున్నారనే వాదన వినిపిస్తోంది.
అప్పట్లో మౌనంగా ఉన్న షర్మిల.. ఇప్పుడు ఎవడ్రా మరదలు అనేది! అంటూ.. ఊగిపోయారు. దీంతో ఎవరో టీఆర్ ఎస్ నాయకులు.. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇదేమంత పెద్ద విషయం కాదు. అయినా.. పనిలేనివారికి పెద్దపనే అన్నట్టుగా.. షర్మిల.. దీనినిపట్టుకుని నాలుగురోజులుగా వేలాడుతున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా పోలీసు బేడీలు మీడియా ముందు చూపిస్తు.. దమ్ముంటే నన్ను అరెస్టు చెయ్యి.. అరెస్టు చెయ్యి.. అంటూ.. సీఎంకు సవాల్ విసిరారు.
అరెస్టు చేశాక ఏముంటుంది.. పాదయాత్ర ఉండదు.. పార్టీ కూడా ఉండదు.. అని అంటున్నారు నెటిజన్లు. ఇదిలావుంటే.. షర్మిల సోదరుడు.. ఏపీ సీఎం జగన్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తనతండ్రి వైఎస్ కుట్రచేసి చంపేశారంటూ.. సెంటిమెంటు రాజకీయాలను తెరమీదికి తెస్తుంటారు. ఇప్పుడు.. ఇదే సఫార్ములాను షర్మిల కూడా తెరమీదికి తెచ్చారు. తనతండ్రి వైఎస్‌ను కుట్ర చేసి చంపేశారని.. తనను కూడా చంపేయాలని చూస్తున్నారని అన్నారు.
వాస్తవానికి ఈ అన్నా చెల్లెలే ఈ కుట్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఆ కుట్ర ఏంటనేది మాత్రం ఇప్పటి వరకు బయటకు చెప్పడం లేదు. మరోవైపు.. షర్మిలను చంపాల్సిన అవసరం ఏముంటుంది..? ఎవరికి ఉంటుంది? ఆమెకేమన్నా..లక్షల ఓట్ల మద్దతుందా.. సర్కారు ఏర్పాటు చేయగల సత్తా ఉందా? ఏమీ లేనప్పుడు.. ఆమెను చంపడేంది? నవ్విపోతున్నా.. ఈ విషయంపై మాత్రం షర్మిలకు క్లారిటీ రావడం లేదని.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.