తన దాకా వస్తే తప్ప.. ఎవరికీ నొప్పి తెలియదు. ఇప్పుడు వైసీపీకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. స్థానిక సంస్థలకు సంబంధించి కూటమి నాయకులు వేస్తున్న పాచికలను వైసీపీ ఎదురొడ్డలేక పోతోంది. ఎక్కడికక్కడ విస్తరిస్తున్న కూటమి హవాను ధైర్యంగా దమ్ముతో ఎదుర్కొనలేక పోతోంది. దీంతో వైసీపీ నాయకులు.. కూటమి పార్టీలపైనా.. ముఖ్యంగా టీడీపీ నేతలపైనా విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఇక్కడే వారు గతాన్ని మరిచిపోతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చే సరికి.. టీడీపీ కూడా జోరు మీదుంది. స్థానిక సంస్థల్లో మంచి పట్టు బిగించింది. కానీ.. వైసీపీ వచ్చాక.. ఆయా స్థానిక సంస్థలను తనవైపు తిప్పుకొని.. తన వారిని ఎంచుకుని.. టీడీపీ నాయ కులను అదిలించి.. బెదిరించి.. వశం చేసుకుంది. ఫలితంగా అప్పట్లోనూ ఇదే పర్వం కొనసాగింది. అస లు ఉనికిలో లేని స్థానిక సంస్థల్లోనూ వైసీపీ పగ్గాలు చేపట్టింది. అప్పట్లో టీడీపీ నేతలపై హత్యాకాండలు కూడా జరిగాయని ఆ పార్టీ నాయకులు పలు మార్లు ఆరోపించారు.
అలాంటి వైసీపీ ఇప్పుడు నీతులు చెబుతోంది. స్థానిక సంస్థల్లో నిర్లజ్జగా వ్యవహరించిన నాయకులే ఇప్పు డు నీతులు వల్లెవేస్తున్నారు. గత 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ వారిని కనీసం.. నామినేషన్ వేసేందుకు కూడా దరికి రానివ్వకుండా చేసిన తీరు.. అందరినీ కలవరపాటుకు గురి చేసింది. పైగా.. ఎన్నికల కమిషనర్ చైర్మన్కు కులం అంటగట్టి.. అభాసు పాలు చేయాలని ప్రయత్నించి.. తానే అభాసు పాలైంది. ఇవన్నీ ప్రజలు మరిచిపోలేదు.
పార్టీలు అంతకన్నా మరిచిపోలేదు. అందుకే.. ఈరోజు వైసీపీ రొద పెడుతున్నా.. తమకు అన్యాయం జరి గిందని చెబుతున్నా.. ఎవరికీ సానుభూతి రావడం లేదు. రేపోమాపో.. కూటమి అన్ని చోట్లా పట్టు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని కాపాడుకునే ప్రయత్నంలో వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు.. బాగానే ఉన్నా.. గతంలో చేసిన అరాచకాలను మరిచిపోయినట్టుగా నటించడం.. టీడీపీ నేతలను బెదిరించిన తీరు.. వంటివి.. ఇప్పుడు తనదాకా వస్తే తప్ప.. నొప్పి తెలియడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.