రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఉండ కూడదు కూడా. కేవలం ఆత్మహత్యలే ఉంటాయి. ఎందుకంటే.. ప్రత్యర్థులపై నేరుగా దాడులకు దిగితే.. ఆ ఎఫెక్ట్ దాడి చేసిన పార్టీపై ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్ప నక్కర లేదు. జయలలితను అసెంబ్లీలో పరాభవించిన తర్వాత.. తమిళనాడులో డీఎంకే అధినేత, దివంగత కరుణానిధిపై చెప్పులు పడ్డాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. అంటే.. అక్కడ జరిగింది.. హత్య. దాని తాలూకు ప్రభావం.. కరుణానిధి అనుభవించారు.
అందుకే.. రాజకీయాల్లో ఆత్మహత్యలనే ప్రత్యర్థలపై ప్రేరేపిస్తారు. కానీ,ఏపీలో ఇప్పుడు జరిగిన చంద్రబా బు అరెస్టు, దరిమిలా ఆయనను జైలుకు పంపించడం ఘటనలు చూస్తే.. రాజకీయంగా సీఎం జగన్ దూకుడు ప్రదర్శించారని, ఆయన మగాడ్రా బుజ్జీ.. అని, ఇంతటి గట్స్ ఎవరికీ లేవని సమర్థించేవారు.. పొర్లు దండాలు పెట్టేవారు చాలా మందే ఉండొచ్చు. ఉన్నారు కూడా. కానీ, వాస్తవానికి.. ఏపీ రాజకీయాల ను పరిశీలిస్తే.. కక్షపూరిత రాజకీయాలను ఏపీ ప్రజలు ఏనాడూ సహించలేదు.
సో.. ఇదే అంశం.. ఇప్పుడువైసీపీలో తర్జన భర్జనగా మారింది. “ఏదో అనుకున్నాం. ఏదో జరుగుతోంది. మాపై ఆశలు సన్నగిల్లుతున్నాయి“ అని నాయకులు తమలో తాము అనుకునే పరిస్థితి వచ్చిందంటే.. క్షేత్రస్థాయిలో చంద్రబాబు అరెస్టు, జైలు పరిణామం ఏ రేంజ్లో ప్రభావం చూపిస్తోందో అర్థం చేసుకోవ చ్చని పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి చంద్రబాబు అరెస్టు విషయంలో వైసీపీ తనకు అనుకూలం గా రాజకీయం మారుతుందని.. అంచనా వేసుకుందని అంటున్నారు.
అయితే.. తొలి రెండు రోజులు ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ.. రాను రాను చంద్రబాబు అరెస్టును అక్రమ మని, ఆయనను కుట్ర పూరితంగా వైసీపీ ప్రభుత్వం జైల్లో పెట్టిందని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం క్షేత్రస్థాయికి చేరింది. గ్రామాల్లోని రచ్చబండల దగ్గర, పొదుపు సంఘాల చర్చల్లో కూడా..చంద్రబాబుకు సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాలే వైసీపీలో తర్జన భర్జనను తెరమీదికి తెస్తున్నాయి. అనుకున్నది ఒక్కటైతే.. జరుగుతోంది మరొకటి.. మా పరిస్థితి ఏమవుతుందో.. అని వైసీపీ నేతలు.. గుసగుసలాడుతున్నారంటే..చంద్రబాబు ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు.