ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. జగన్ హయాంలో టీడీపీ, జనసేన ముఖ్యనాయకులపై పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయి, అడ్డూ అదుపూ లేకుండా నోరు పారేసుకున్న వైసీపీ నేతలంతా.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే గత తొమ్మిది నెలల నుంచి కూటమి సర్కార్ రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి సారించింది. వైసీపీ నేతల అక్రమాలు, ఆగడాలపై సైలెన్స్ మెయింటైన్ చేసింది. దీంతో ఇప్పుడిప్పుడు మళ్లీ వైసీపీ నేతలు బయటకు వస్తున్నారు.
అయితే ఇలాంటి సమయంలో కూటమి ప్రభుత్వం రూటు మార్చింది. వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకుంటే కార్యకర్తలు, ప్రజల ఆగ్రహాన్ని గురికావాల్సి వస్తుందని భావించి ఇప్పుడిప్పుడే ఫ్యాన్ పార్టీ నేతలపై ఫోకస్ పెట్టింది. ఇంతలోనే వారానికి ఒకరు చొప్పున రెండు వారాల్లో ఇద్దరు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. అందులో ఒకరు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాగా.. మరొకరు పోసాని కృష్ణ మురళి. టీడీపీ ఆఫీసులో పని చేసే సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నారు. మరోవైపు జనసేన నాయకుడు చేసిన ఫిర్యాదు మేరకు గతరాత్రి హైదరాబాద్ లో పోసానిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ నేతల వరుస అరెస్ట్లు నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కొందరు నాయకుల్లో టెన్షన్ స్టార్ట్ అయిందట. అయితే నెక్స్ట్ అరెస్ట్ కాబోయే రేసులో ముగ్గురు వైసీపీ నేతలు ఉన్నారని ఇన్సైడ్ బలంగా ప్రచారం జరుగుతోంది. చిత్తూరు, కృష్ణ, ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు చెందిన ఆ ముగ్గురు నేతలు వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ లీడర్లుగా చలామణి అయ్యారట. జగన్ మంత్రివర్గంలో కూడా పని చేశారని సమచారం అందుతోంది. దీంతో ఆ ముగ్గరు నేతలు ఎవరు? అన్న చర్చ ఊపందుకుంది. ఏదేమైనా అధికారం ఉందని రెచ్చిపోతే పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పేందుకు వంశీ, పోసాని లాంటి వైసీపీ నేతలు ఉదాహరణగా నిలుస్తున్నారు.