• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ప్రొటెం స్పీకర్ అంటే ఏమిటి.. వారికి ఎలాంటి ప‌వ‌ర్స్ ఉంటాయి..?

admin by admin
June 20, 2024
in Politics, Trending
0
0
SHARES
213
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ పార్టీని ఘోరంగా ఓడించి కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఇప్పుడు మరో కీలక ఘట్టానికి ముహూర్తం పెట్టారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈనెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీఎం అవకాశం కల్పించారు.

దీంతో ఇప్పుడు ప్రొటెం స్పీకర్ పై చర్చ మొదలైంది. అసలు ప్రొటెం స్పీకర్ అంటే ఏమిటి..? ఎందుకు ప్రొటెం స్పీకర్ ను నియమిస్తారు..? వారికి ఎలాంటి పవర్స్ ఉంటాయి..? వంటి అంశాలను తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా ఎన్నికయిన లోక్ సభ, అసెంబ్లీలకు స్పీకర్ మ‌రియు డిప్యూటీ స్పీకర్ లను ఎంపిక చేయ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల ఆయా సభల వ్యవహారాల‌ను రాష్ట్రపతి, గవర్నర్లు చూసుకోవాలి. లేదా వారు తమ ప్రతినిధిని నియమించుకోవచ్చు.

లోక్ సభలో అయితే రాష్ట్రపతి ఎన్నికైన ఎంపీల్లో ఒకరిని త‌న ప్ర‌తినిధినిగా నియ‌మించుకోవాలి. రాష్ట్రాల అసెంబ్లీలో అయితే గవర్నర్ ఎమ్మెల్యేల్లో ఒకరిని తన ప్రతినిధిగా నియమిస్తారు. అయనే ప్రొటెం స్పీకర్. అయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనేవి రాజ్యాంగబద్ద పదవులు.. వీరికి ప‌వ‌ర్స్ ఉంటాయి. కానీ ప్రొటెం స్వీక‌ర్ కు ఎటువంటి ప‌వ‌ర్స్ ఉండ‌వు. ఎందుకంటే, రాజ్యాంగంలో ప్రొటెం స్పీకర్ అన్న‌ ప‌ద‌మే ఉండ‌దు. ఇదొక తాత్కాలిక ప‌ద‌వి. ఒక్క‌సారి స్పీకర్ ఎంపిక జరిగితే ప్రొటెం స్పీక‌ర్ త‌క్ష‌ణ‌మే సాధారణ ఎమ్మెల్యేగా మారిపోతారు.

అలాగే ప్రొటెం స్పీకర్ గా ఎవరుండాలనే దానిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో గవర్నర్ కూడా ప్రొటెం స్పీకర్ ను ఎంపిక చేయ‌వ‌చ్చు. వయసు రిత్యా కాకుండా సభలో సినియారిటీని పరిగణలోకి తీసుకుని ప్రొటెం స్పీక‌ర్ ను నియ‌మిస్తారు. ఒక‌వేళ సీనియర్ సభ్యుడిగా ఉన్న వ్యక్తి కేబినెట్‌లో భాగస్వామిగా లేదా ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటే అత‌ని తరువాత సీనియర్‌గా ఉన్న ఎమ్మెల్యేను నియమిస్తారు. ఇక ఎవరినైతే ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారో వారు ముందే గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత ప్రోటెం స్పీకర్ గా కొత్త‌గా ఎన్నికైన‌ ఎమ్మెల్యేల చేత‌ ప్రమాణస్వీకారం చేయించాలి.

Tags: Andhra PradeshAndhra Pradesh Assembly Sessionap assemblyap assembly sessionsAP NewsBJPChandrababugorantla butchaiah chowdaryjanasenaLatest newsnara chandrababu naiduprotem speakerspeakerTDPTelugu News
Previous Post

ప‌వ‌న్ అభ‌యహ‌స్తం.. ఊపిరి పీల్చుకుంటున్న నిర్మాత‌లు!

Next Post

క‌ల్కి ఈవెంట్ లో దీపికా ధ‌రించిన బ్రేస్‌లెట్ య‌మా కాస్ట్లీ గురూ!

Related Posts

Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Load More
Next Post

క‌ల్కి ఈవెంట్ లో దీపికా ధ‌రించిన బ్రేస్‌లెట్ య‌మా కాస్ట్లీ గురూ!

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra