కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి లోక్‌సభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గురజాడ అప్పారావు చెప్పిన దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 3.0 ఇన్నింగ్స్‌కు సంబంధించిన మొత్తం బడ్జెట్ ని సమర్పించారు. బడ్జెట్ 2025 లో పేదలు, మహిళలు, యువత, రైతులు, విద్య, వైద్యంకు పెద్దపీట వేస్తూ కీలక ప్రకటనలు చేశారు.
దేశంలో వెనుకబడి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సహించేందుకు పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రులు, 200 ఈ-కేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో బిహార్‌కు కేంద్రం భారీగా కేటాయింపులు ఇచ్చింది. రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందని మధ్యతరగతి వారికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఇక బడ్జెట్ 2025 ఎఫెక్ట్ తో ధరలు తగ్గే వస్తులు ఏవి, పెరిగే వస్తువులు ఏవి అన్నది పరిశీలిస్తే..
ధరలు తగ్గేవి:
– క్యాన్సర్ మందులు, అరుదైన వ్యాధులకు వాడే మందులు
– చేపల పేస్ట్
– ఫ్రోజెన్ చేపలు
– వెట్ బ్లూ లెదర్
– క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు
– 12 కీలకమైన ఖనిజాలు
– ఓపెన్ సెల్
– ఎల్సిడి, ఎల్ఈడి టీవీలు
– మొబైల్ ఫోన్లు
– వైద్య పరికరాలు
– తోలు వస్తువులు
– భారతదేశంలో తయారైన దుస్తులు
ధరలు పెరిగేవి:
– ఫ్లాట్ ప్యానెల డిస్ ప్లేల ధరలు పెరుగుతాయి.
– సిగరెట్లు ధరలు పెరుగుతాయి.