అవును కొన్నిసార్లు అధికారయంత్రాంగం, సొంత పార్టీ నేతలు చేసే అత్యుత్సాహ పనులకు పాలకులే సమాధానం చెప్పుకోవాల్సొస్తుంది. ఎందుకంటే ముందు వెనకా చూసుకోకుండా అధికారులు వ్యవహరించినా దాని ప్రభావం మాత్రం పాలకులపైనే పడుతుంది కాబట్టి. అది వారి నిర్లక్ష్యం కిందకే వస్తుంది.
ఇంతకీ విషయం ఏమిటంటే వైజాగ్ లో హిడెన్ స్ప్రౌట్స్ పేరుతో మానసిక దివ్యాంగుల కోసం ఓ స్కూల్ నడుస్తోంది. ఆ స్కూల్ కు అనుబంధంగా నిర్మిస్తున్న కొన్ని షెడ్లను అధికారులు తాజాగా కూల్చేశారు. దాంతో వివాదం మొదలైంది.
స్కూల్ ఉన్న ప్రాంగణంలో యాజమాన్యం అనధికారికంగా కొన్ని షెడ్లను నిర్మిస్తోంది. ఆ విషయం అధికారయంత్రాగానికి చేరింది. దాంతో వెంటనే స్పందించిన యంత్రాంగం షెడ్లను కూల్చేయటంతో పాటు స్కూలు బిల్డింగును స్వాధీనం చేసుకోవటానికి నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో సమస్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అధికారులు చేసిన పని ప్రతిపక్షలకు ఆయుధంగా మారింది.
అనుమతి లేకుండా హిడెన్ స్ప్రౌట్స్ స్కూల్ యాజమాన్యం షెడ్లు వేసుకోవటం తప్పే అయితే ఆ విషయాన్ని తెలియజేసే మార్గం మరొకటుంటుంది. ముందుగా యజమాన్యానికి నోటీసులిచ్చి తర్వాత విచారణ జరిపి ఆ అక్రమ నిర్మాణాలను కూల్చేసుకునే అవకాశం యాజమాన్యానికే ఇవ్వాలి. తామిచ్చిన అవకాశాన్ని యాజమాన్యం పట్టించుకోకపోతే అప్పుడు అధికారులు తీవ్రంగా స్పందించినా తప్పుపట్టాల్సిన అవసరంలేదు.
కానీ ఇక్కడ అధికారులు అలా చేసినట్లు లేదు. ఫిర్యాదులు రాగానే ఏకంగా షెడ్ల కూల్చివేతకు దిగేశారు. ఆ కాంపౌండ్ లో దాదాపు 190 మంది పిల్లలుంటున్నారు. ఇక్కడ చాలా కాలంగా హిడెన్ స్ప్రౌట్స్ పేరుతో దివ్యాంగుల కోసం స్కూల్ నడుస్తున్న విషయం చాలామందికి తెలుసు. అలాంటిది ఇంతమంది పిల్లలుండే స్కూల్ కాంపౌండ్ విషయంలో అధికారులు, వైసీపీ నేతలు వ్యవహరించి తీరుపై జనాల్లోనే వ్యతిరేకత వస్తోంది.
ఏదో రాజకీయ నేతలు ఆక్రమణలను తొలగించిన పద్దతిలోనే దివ్యాంగుల స్కూలు విషయంలో యంత్రాంగం వ్యవహరించటం బావోలేదు. అయితే, కొందరు వైసీపీ నేతలు ఈ స్కూలు స్థలం మీద కన్నేయడం వల్లే ఈ కూల్చివేత జరిగిందనేది స్థానికులు, ప్రతిపక్షాల ఆరోపణ.
మెల్లగా నోటీసులు ఇచ్చి చేసుంటే ఆ అవకాశం ఉండేదేమో గాని… ఇంత రచ్చయ్యాక ఇక ఉన్నదీ పాయె ఉంచుకున్నదీ పాయె అన్నట్టుంది వైసీపీ నేతల పరిస్థితి. ఇదంతా విజయసాయిరెడ్డి నాయకత్వంలో నడుస్తున్న జిల్లాలో జరగడం గమనార్హం.
జగన్ ఈ విషయంలో ఎంత త్వరగా స్పందిస్తే అంతమంచిది. లేకపోతే ముఖ్యమంత్రి పాత్రపై కూడా జనం అనుమానం వ్యక్తంచేసే ప్రమాదం లేకపోలేదు.
If not for anything, at least for this demonic act Vizag will throw YCP out of the city in 2024..
— Shylaja ???? (@Shylaja_Sakura) June 6, 2021
— Priya Patta, YSRCP (@priya_patta) June 6, 2021