భక్తులు పరమపవిత్రంగా కొలిచే ఏడుకొండల వాడికి భక్తితో సమర్పించిన కానుకలు దుర్వినియోగం అవుతున్నాయని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తిరుపతి హుండీ నుంచి 7 కోట్ల 50 లక్షలు పెట్టి టీటీడీ అధికారుల కోసం 35 కార్లు…కొన్నారు..
అసలు తిరుపతి దేవస్థానం అధికారులకి కార్లు ఇవ్వాలనే ప్రతిపాదన ఎవరు చేశారు, ఎందుకు చేశారు?
భక్తులు భగవంతుడికి సమర్పించిన ముడుపులు దేవస్థానం అభివృద్ధి స్వామివారి సేవలు భక్తుల సౌకర్యాలు కొరకు వినియోగించకుండా ఆ సొమ్ముతో అధికారులకి కార్లు కొనాలనే ఆలోచన ఎవరిది?
ఈ కార్లు పొందిన అధికారుల్లో ఎంతమంది అన్య మతస్తులు ఉన్నారు?
ఎంతటి దౌర్భాగ్యం పట్టింది దేవుడా!
ఒక వైపు లడ్డూ ప్రసాదం ధరలు పెంచారు. అద్దె రూములు రేటు పెంచారు.
మరో వైపు దేవస్థానం సొమ్ము 7 కోట్ల 50 లక్షలు ఖర్చుపెట్టి దేవస్థానం అధికారుల కివ్వడానికి 35 కార్లు కొన్నారు.
భక్తులకు ఏ సౌకర్యాలు కలిగించాలన్నా నిధులు లేవంటారు. భక్తులపై ధరల భారం మోపుతారు.
అయినా భక్తులు బాధపడరు. ఎందుకంటే అక్కడ పెట్టే ఏ ఖర్చయినా స్వామి వారికి పోతుంది లే అనుకుంటారు.
కానీ
జగన్ సర్కారు మాత్రం తిరుమలలో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తోంది.
భోజనం అమ్మడం మొదలుపెట్టగా భక్తుల ఆగ్రహంతో వెనక్కు తగ్గారు.
దర్శనం టిక్కట్ల రేట్లు పెంచారు.
ఆర్జిత సేవ టిక్కట్ల రేట్లు పెంచారు.
వసతి గదుల రేట్లు పెంచారు.
ఎందుకీ అరాచకం