ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 11న విశాఖపట్నానికి వస్తున్నారు. ఇక్కడ ఆయన ఒక రాత్రి, ఒక పగలు ఉండనున్నారు. రూ.16000 వేల కోట్ల రూపాయల పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అయితే.. విశాఖకు మోడీ వస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సంచలన విషయాన్ని తెరమీదికి తెచ్చింది.
దీనిపై ప్రధాని మోడీ దృష్టి పెట్టాలని కూడా డిమాండ్ చేస్తోంది. మరి అదేంటి? ఎందుకు? దీనివల్ల వైసీపీ ఇరకాటంలో ఎలా పడుతుంది? అనేది ఆసక్తిగా మారింది.
మోడీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు రుషికొండను కళ్లారా చూడాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రధానికి తాజాగా లేఖ రాశారు. ఏరియల్ సర్వే చేయడం ద్వారా రుషికొండ అక్రమాలు స్వయంగా వీక్షించవచ్చని విజ్ఞప్తి చేశారు.
“ మొత్తం 61 ఎకరాల రుషికొండ ‘హిల్ ఏరియా’లో 9.88 ఎకరాల్లో ప్రాజెక్టుకు ఏపీటీడీసీ అనుమతి తీసుకోగా… క్షేత్ర స్థాయిలో దీనికి రెండింతల తవ్వకాలు జరిగినట్లు కనిపిస్తోంది. కొండ మధ్యలో చిన్న భాగం తప్ప మిగిలిన అంతటా భారీగా తవ్వేశారు. శిఖర భాగాన్ని వదిలి చుట్టూ తవ్వకాలు జరిపారు. అటవీశాఖ 139 చెట్లు తొలగించినట్లు పేర్కొనగా… వందల సంఖ్యలో చెట్లను తొలగించినట్లు పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు“ అని అయ్యన్న తన లేఖలో విన్నవించారు.
అంతేకాదు, రాజధాని అమరావతి విషయాన్ని కూడా అయ్యన్న ప్రస్తావించారు. ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతికి భిన్నంగా 3 రాజధానులంటూ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరును లేఖలో అయ్యన్న వివరించారు. అమరావతి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుందనే స్పష్టతను ప్రధాని ఇవ్వాలని అయ్యన్న ఆకాంక్షించారు. మూడు న్నరేళ్లుగా పోలవరం పనులు జరగలేదని, ప్రధాని స్థాయిలో ఓ సమావేశం నిర్వహించి పోలవరం పూర్తయ్యేలా చూడాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈనెల 12న విశాఖ పర్యటనకు రానున్నారు. రూ.16,472 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
https://twitter.com/SebaVeluru/status/1589607281276366850
విశాఖ రుషికొండ వివాదంలో రాష్ట్ర హైకోర్ట్ కీలక ఆదేశాలు…#Rushikonda pic.twitter.com/c3XPuGZWi3
— Janasena Visakhapatnam (@JSPForVizag) November 3, 2022