జగన్ కి టీడీపీ బర్త్ డే గిఫ్ట్ ఇదే
రివెంజ్ లు రియాలిటీ నుంచి సోషల్ మీడియాలోకి ఎక్కేశాయి. జగన్ అభిమానులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు పుట్టిన రోజు నాడు నెగెటివ్ ట్రెండ్ చేసిన విషయం తెలిసిందే. జగన్ అభిమానులు.... పవన్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ను పోలినట్లున్న #happybirthdaypawalakalyan అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు. ఒకరిద్దరు సెలబ్రెటీలు సైతం పొరబాటుగా ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు వేసేయడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. దాన్ని చూపించి యాంటీ ఫ్యాన్స్ కామెడీలు చేశారు.
అలాగే చంద్రబాబు విషయంలోను #cbn420 అంటూ ట్రెండ్ చేశారు. కాకపోతే సీబీఎన్ మీద చేసిన నెగెటివ్ ట్రెండ్ పెద్దగా ట్రోల్ కాలేదు. తాజాగా జగన్ అభిమానులు చేసిన పనికి జగన్ మీద రివెంజ్ తీర్చుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు, టీడీపీ అభిమానులు.
ఈరోజు జగన్ పుట్టిన రోజు. డిసెంబరు 20వ తేదీ రాత్రే పవన్ అభిమానులు తమ సత్తా చూపించారు. జగన్ పుట్టిన రోజున ఆయన అభిమానులు #hbdysjagan అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి వైరల్ చేశారు. దాన్ని పోలినట్లే #hbdysjalaga అని హ్యాష్ ట్యాగ్ పెట్టి పవన్ అభిమానులు ట్వీట్లు మొదలుపెట్టారు. ఇది విపరీతంగా వైరల్ అయ్యింది. సుమారు 2 లక్షల ట్వీట్లు ఈ హ్యాష్ ట్యాగ్ తో పడ్డాయంటే ఎంత ట్రెండ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ రాయ్ లక్ష్మీ ఈ హ్యాష్ ట్యాగ్‌తో ఉన్న ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. పాత స్క్రీన్ షాట్లన్నీ పెట్టి రివెంజ్ అని చెబుతున్నారు.
ఇక టీడీపీ ఇంకోరకంగా జగన్ పై అధికారికంగా ట్రెండ్ చేస్తోంది. పార్టీ అఫిషియల్ గా జగన్ చెప్పిన అబద్ధాలను సేకరించి ఇమేజ్ లు చేసి ##HBDFakeCM అని ట్రెండ్ చేస్తోంది. ఇది కూడా సుమారు లక్ష ట్వీట్లు దాటాయి. బాగా ట్రెండ్ అవుతోంది. పుట్టిన రోజును జగన్ ను విమర్శించడానికి టీడీపీ ఒక అవకాశంగా మలచుకుంది.
మీరు ప్రూఫ్ లేకుండా ఆరోపణలు చేస్తూ ట్రోల్ చేస్తారేమో కానీ టిడిపి సోషల్ మీడియా మాత్రం విత్ ప్రూఫ్ తో ట్రోల్ చేస్తుంది #HBDFakeCM pic.twitter.com/1FCGKsgRNU
— Sreenivas C(A+)✌️🚴 (@SreenivasC14) December 21, 2020