వైజాగ్ నుంచి సాయిరెడ్డి అవుట్ !!

వైసీపీలో సంచ‌ల‌న విష‌యం చోటుచేసుకోనుందా?  ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర జిల్లాల ఇంచార్జ్ గా పార్టీ కీల‌క నాయ‌కుడుగా, ఎంపీగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డిని ఢిల్లీకే ప‌రిమితం చేయ‌నున్నార‌ని వైసీపీ సీనియ‌ర్లలో చర్చ నడుస్తోంది.  జగన్ సీఎం అయిన వెంటనే ఆయనకు 5 పదవులు ఇచ్చారు. కానీ క్రమంగా జగన్ కి సాయిరెడ్డికి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది.  చివరకు సాయిరెడ్డిని మార్చేదాకా వచ్చింది పరిస్థితి. అసలు సాయిరెడ్డిని మార్చాల్సిన అవ‌స‌రం ఎందుకు వ‌చ్చింది?  అస‌లు ఈ మార్పు నిజ‌మేనా? అనే అంశాలు ఆస‌క్తిగా మారాయి.

గ‌త 2014 ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో వైసీపీకి కీల‌క నేత‌గా ఉన్నారు సాయిరెడ్డి. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా చ‌క్రం తిప్పుతూనే ఆయ‌న ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోనూ త‌న‌దైన దూకు డు ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌స్తుత మంత్రి అవంతి స‌హా ప‌లువురు నేత‌ల‌ను పార్టీలోకి చేర్చ‌డంలో ఆయ‌న స‌క్సె స్ అయ్యారు. ఈ ప‌రిణామాల‌తో అప్ప‌టి నుంచి ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు సాయిరెడ్డినే ఇంచార్జ్‌గా జ‌గ‌న్ కొన‌సాగించారు.

అయితే.. ఇటీవ‌ల కాలంలో సాయిరెడ్డిపై ఆరోప‌ణ‌లు పెరిగిపోయాయి. భూముల విష‌యం లో దూకుడు, కుటుంబ స‌భ్యుల ప్ర‌మేయం.. వంటివి సొంత పార్టీలోనే చ‌ర్చ‌కు వ‌చ్చాయి. పైగా.. ఒక‌ప్పు డు సాయిరెడ్డిని చూసి పార్టీలోకి వ‌చ్చిన వారు.. ఇప్పుడు అదే సాయిరెడ్డిపై ఫిర్యాదులు చేస్తున్నారు.

అంతేకాదు, కొత్త‌గా రావాల్సిన వారు.. వ‌స్తార‌ని అనుకున్న నాయ‌కులు కూడా సాయిరెడ్డి ఉంటే.. తాము పార్టీలోకి వ‌చ్చేది లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మంత్రులను సైతం.. డమ్మీలు చేశార‌నే వాద‌న సాయిరెడ్డి విష‌యంలో జోరుగా వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌తో కొన్నాళ్ల కింద‌ట పెద్ద పంచాయ‌తీనే న‌డిచింది. దీంతో ఇప్పుడు సాయిరెడ్డి స్థానంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి ఇక్క‌డి బాధ్య‌త‌లు అప్ప‌గించేం దుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించార‌ని అంటున్నారు సీనియ‌ర్లు.

అయితే.. ఢిల్లీలో మాత్రం సాయిరె డ్డికి మ‌రిన్ని బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని చెబుతున్నారు. అయితే. ఈ మార్పు తాత్కాలిక‌మేన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సాయిరెడ్డికి తిరిగి.. రాష్ట్రంలో కోస్తాంధ్ర బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మొత్తానికి ఈ విష‌యం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారి సంచల‌నం సృష్టిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.