టీడీపీ కూడా కొన్ని లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగుతోంది.
ఇటు అధికార పార్టీ ఎలా అయితే కొన్ని నియోజకవర్గాలను ఎంచుకుని మరీ వాటిలో విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందో.. ఇటు టీడీపీ కూడా వైసీపీ కుంభస్థలాలపై దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోం ది.
టీడీపీకి కంట్లో నలుసుగా ఉన్న మొత్తం ఐదారుగురు నాయకుల నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరేయాలనేది పార్టీ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
వాటిలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను ఓడించడం ద్వారా తమ సత్తా నిరూపించాలని చూస్తోంది.
ఈ నేపథ్యంలో తెరవెను క బాగానే కసరత్తు సాగుతోంది.
విషయంలోకి వెళ్తే.. టీడీపీకి కంట్లో నలుసుగా ఉన్న నాయకులు మంత్రి అంబటి రాంబాబు, రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మరో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఉన్నారు.
వీరిని ఓడించాలనేది లక్ష్యంగా టీడీపీ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే, వీరిలో అంబటి రాంబాబు తప్ప మిగిలిన వారికి ఆయా నియోజకవర్గాలపై పట్టుంది.
పైగా గత ఎన్నికలలో అంతో ఇంతో భారీ మెజారిటీతోనే విజయందక్కించుకున్నారు.
ఇక, వీరిలో రోజా, కొడాలి నాని ఫైర్ బ్రాండ్స్‌గా రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో వీరిని ఓడించడంపై దృష్టి పెట్టారట.
దీనికి సంబంధించి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్కొక్క నియోజకవర్గంలో పరిస్థితిని అంచనా వేసేందుకు నాయకులను రంగంలోకి దింపుతు న్నారు. పక్కా స్కెచ్‌తో వ్యక్తిగతంగా కాకుండా అభివృద్ధి పేరిట.. నియోజకవర్గంలో ఉన్న లోపాలను ఎత్తి చూపి వారిని ఓడించేలా పక్కా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని టీడీపీ నిర్ణయించింది.
అదేసమయంలో ఒక్కొక్కరికీ ఒక్కొక్క వ్యూహాన్ని కూడా అమలు చేయాలని భావిస్తోంది. ఎందుకంటే.. అన్ని నియోజకవర్గాల్లోనూ అనేక వైవిధ్యాలు ఉన్నాయి. సో.. వాటికి తగిన విధంగా ప్లాన్ చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకుంటున్నారు.
దీంతో ఈ నియోజకవర్గాలను ప్రత్యేకంగా పరిగణించి.. ఐ-టీడీపీకి కూడా బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారట.
ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు వారి సమస్యలు. ఇలా అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి పోరును తీవ్రతరం చేయనున్నారు.
అయితే, ఎటొచ్చీ టీడీపీ ఎంచుకునే అభ్యర్థులపైనే ఈ ప్రయోగం ఆధారపడి ఉంటుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.