గత రెండేళ్లుగా థ్రిల్లర్ సినిమా తరహాలో జరుగుతున్న ‘తానా’ ఎన్నికల ప్రహసనం చివరికి ఒక కామెడీ గా ముగిసిందనుకునే లోపే మళ్లీ ఒక్క కుదుపుతో హారర్ మూవీ తరహాలోకి మారి మళ్ళీ కొనసాగుతోంది.
నిజమైన తానా శ్రేయోభిలాషులు ఇది మంచికా చెడుకా అని తర్జనభర్జనలు పడుతుండగా అనేకమంది సర్దారాయుళ్లకు మిర్చి మసాలా కబుర్లతో కావాల్సినంత కాలక్షేపం దొరికింది.
క్లుప్తంగా చెప్పాలంటే ఎన్నికల్లో లబ్ధి కోసం అన్ని వర్గాలు కలిసి మిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరించి ఓట్ల కోసం సభ్యులను చేర్చి, వారికి ఓటు హక్కు ఇచ్చే విషయంగా ఇంటా బయటా కాట్లాడుకునే లోపున ‘తానా’ నిబంధనల ప్రకారం ఎన్నికలు పూర్తి కావలసిన సమయం దాటిపోయింది.
ఇదే అదనుగా ‘తానా’ సభ్యుల అభీష్టాలతో సంబంధం లేకుండా పెత్తనం చెల్లించాలనుకునే లాబీయిస్టులు రంగంలోకి దిగి ఇంతకుముందు వారి కటాక్ష వీక్షణాలతో పదనులనుభవంచిన వారి సహకారంతో కుటిల ప్రయత్నాలు జరిపి వర్గాల మధ్య సయోధ్య కుదర్చకుండానే పదవుల పంపకాలంటూ ఉన్న పదవులన్నింటినీ ‘దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకోవటం’ లాగా ఎన్నికల ఊసు లేకుండా ‘బోర్డు నియామకాల’ రూపంలో పంచారు.
పనిలో పనిగా అర్హతల బేరీజు లేకుండా ‘నైతిక’ భాద్యతలను కాలరాసి తమకు కావలసిన వారిని లాబీయిస్టులతోపాటు అన్ని వర్గాలు గుంభనగా పంచుకున్నారు.
దీనిని ‘గిల్లికజ్జాలాడుకుంటున్న పిల్లుల మధ్యన నక్క జిత్తుల సలహాలతో పండు కోతులు చేసిన పంచాయతీ‘ గా పలువురు పరిహసిస్తున్నారు.
అందుకు తగినట్లుగానే రెండు వారాల్లోనే పెళ్లి పెటాకులై ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటుండగా కొందరు ‘బోర్డు నియామకాలు’ చెల్లవు అంటూ విధిగా 2023 ఎన్నికలు సత్వరం జరపాలంటూ లీగల్ నోటీసు జారీ చేస్తూ న్యాయ పోరాటం మొదలు పెట్టారు.
‘తానా’ చట్టాలపై అవగాహన ఉన్న పలువురు సీనియర్లు ఈ న్యాయపోరాటం సమంజసమే అనీ న్యాయవ్యవస్ధ వీరికి అనుకూలంగా తీర్పు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.
ఈ లోపున కావాల్సిన వాళ్లకి కావాల్సినంత ‘పిచ్చ కామెడీ’ కి ఆస్కారం మెండుగా ఉన్నది
తాజా సమాచారం ప్రకారం గత వారం జరిగిన ‘తానా’ ఫౌండేషన్ మీటింగ్ లో ఫౌండేషన్ నాయకత్వం కోసం జరిగిన ఎన్నికల్లో వర్గాల మధ్య ఉన్న అంతరం భగ్గున మండింది.
‘తానా’ బోర్డులో కూడా సభ్యత్వం ఉండే మూడుకి మూడు ఫౌండేషన్ పదవుల్లో ఒక్కటి కూడా రాని ‘తానా’ అధ్యక్ష వర్గం మోసానికి గురయ్యామని ఆక్రోశిస్తుంటే ఇంకా ‘ముందుంది ముసళ్ల పండగ’ అంటూ ప్రత్యర్థుల అనుయాయులు సూచనలిస్తున్నారు.
అయితే తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రత్యర్థుల ‘మాయాజాలం’ లో పడి నిండా మునిగిన అధ్యక్ష వర్గం లోని అతివాదులు ‘తానా’ నిబంధనలకు విరుద్ధంగాను, అవమానకరంగా జరిగిన పొత్తులకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి చేస్తున్న ఏర్పాట్లకు ఈ పరిణామాలు సానుకూల పడ్డాయి.
వివాదాస్పదం గా పదవులన్నింటిని ‘తానా బోర్డ్ సెలక్షన్’ తో సరిపెట్టిన విషయం మరియు అట్టి వివాదాస్పద సభ్యుల కూర్పుతో జరిగిన ‘తానా’ ఫౌండేషన్ మీటింగ్ రుజువులతో ‘న్యాయ పోరాటం’ సిద్ధం చేశారు.
మళ్ళీ ‘తానా’ బోర్డు కూడా సమావేశమయ్యే ఆగస్టు 10వ తేదీకి ముందుగా ఈ వివరాలన్నింటినీ ఉదహరిస్తూ ఈ వ్యవహారమంతా చెల్లదని లీగల్ డిమాండ్ నోటీసుతో న్యాయ ప్రక్రియ మొదలుపెట్టారు.
‘తానా’ బోర్డునకు పంపిన లీగల్ డిమాండ్ నోటీసును ‘నమస్తే ఆంధ్ర’ పాఠకులు చూడవచ్చును.
ఇంతటితో మూడు వర్గాల మధ్యన ఉన్న వివాదాలు మళ్ళీ రాజుకుని పరిణామాలు ఎంతకాలం ఎక్కడివరకూ సాగుతాయో, తుదకు ఎలా ముగుస్తుందో నని అమెరికా మరియు ఇండియా లోని పలువురు తెలుగు వారు ఆసక్తిగా చర్చిస్తున్నారు.
పనిలో పనిగా ‘బోర్డు సెలక్షన్’ రూపంలో పదవులు ఇచ్చిన విధానం ముసుగులో వ్యవహారంగా ఉందని గతంలో పోటీ చేసిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోకపోవడం, అసలు పోటీ చేయని వారికి కూడా పదవులివ్వడం, ఎంపిక చేసిన వారిలో పలువురికి వివాదాస్పద చరిత్ర ఉండడటం, ముఖ్యంగా ‘తానా’ నిధుల వినియోగంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారికి పదవులు ఇస్తూ నిర్వివాదమైన వారిని విస్మరించటం వగైరా విషయాలు ‘తానా’ మంచి కోసం గాక ‘తమ’ మంచి కోసమే అని ఇంకా చెప్పాలంటే ‘తానా’ ను పూర్తిగా వాడుకుంటూ తమకు ‘లాభాలు’ చేసుకోవడమే గమ్యం అని గత అనుభవాల రీత్యా పలువురు నమ్ముతున్నారు.
ఇక ప్రస్తుత వ్యవహారాన్ని మూడు వర్గాలు తమకు అనుకూలంగానూ వ్యతిరేకులకు ప్రతికూలంగానూ ప్రచారం చేసుకోవడం సాధారణ విషయమైనప్పటికీ ఆసక్తికరమైన ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి.
ముఖ్యంగా అధ్యక్ష వర్గం లోని అతివాదులు తమ నాయకులను ‘బురిడీ’ కొట్టించిన పూర్వపు అధిష్ఠానవర్గం పై వివిధ రకాలుగా కత్తులు దూస్తున్నారు.
వారు సుదీర్ఘకాలంగా ‘కులాన్ని’, ‘రాజకీయ పార్టీ’ నీ వాటితో పాటు ముఖ్యంగా ‘తానా సంస్థ’ నూ, చోటామోటా నాయకులను తమ ‘అన్ని రకాల’ అవసరాలకు వాడుకున్న విషయం బహిర్గతమేననీ మళ్ళీ వాడుకుంటానికి, ఇంకా ఇంతకు మునుపు వాడకాన్ని మరుగున పర్చడానికి వ్యూహాలు పన్ని అమలు చేస్తున్నారని వాటిని తాము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్తున్నారు.
ఇంకా ఈ విషయాలకు సంబంధించి ముఖ్యంగా ‘రక రకాలుగా’ వాడుకున్న రుజువులను క్రమక్రమంగా బహిర్గత పరుస్తామని అంతకుముందు తమతో పని చేసి చిన్నపాటి భేదాలతో ప్రస్తుతం ప్రత్యర్థులతో అవసరార్థం పనిచేస్తున్న అట్లాంటా వర్గీయులు జాగ్రత్తగా మసలుకోవాలనీ వీలైతే తమతో తిరిగి పని చేయాలని కోరుతున్నారు.
అయితే వారు తమ గత అనుభవాల రీత్యా అధ్యక్ష వర్గంలోని కొందరితో పనిచేసే అవకాశం ఎప్పటికీ ఉండదనీ, ప్రస్తుత పరిస్థితి తమకు అత్యంత అనుకూలంగా ఉన్నందున యధాతథ పరిస్థితి కొనసాగిస్తూ భవిష్యత్తులో మరింతగా బలపడాలనీ, సంస్థ భవిష్యత్తు తమతోనే మంచిగా ఉంటుందని పలువురు భావిస్తున్నారని ఊహిస్తున్నారు.
కానీ వారి ఏకపక్ష ధోరణి మార్చుకోవాలని, మంచి నాయకులను సమకూర్చుకునే అవకాశం ఇప్పుడు ఉన్నదని, ఈ జులై నెలలో చేసిన ‘తానా కాన్ఫరెన్స్’ లోని పలు పొరపాట్లు జరగకుండా ఉండే సమర్థత కూడా సమకూర్చుకోవాలని విమర్శకులంటున్నారు.
ముఖ్యంగా తానా కాన్ఫరెన్స్ డోనర్ల సదుపాయాలను పూర్తిగా విస్మరించడం, బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లు అమ్ముకున్నారని రగడ, రెండు రోజులపాటు భోజనమే గగనమవడము, ఎన్టీఆర్ కార్యక్రమాలే ‘తానా’ బాధ్యత అన్నట్లు షెడ్యూల్ ఉండడం, నాయకులు సభావేదిక మీద నిస్సిగ్గుగా ‘బాలకృష్ణ’ భజన చేయడం, స్వంత వర్గాన్ని అందలమెక్కించడం వంటి వాటిని తానా సభ్యులు సహించడం కష్టమనే గ్రహించాలి.
ఇక పాత స్వయం ప్రకటిత అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో తమ మాయలో పడ్డ గత అధ్యక్షుల అమాయకత్వం మూలంగా ‘గుడ్డిలో మెల్ల’ లాగ తమ అనుచరుడికి ‘ముఖ్య’ పదవి ఇప్పించుకోవడం తో సరిపెట్టుకోక “సంస్థ మొత్తం” మళ్ళీ గుప్పిట్లోకి వచ్చిందని భావిస్తూ గత పోకడలకు తగినట్లు పార్టీ మరియు సంస్థ పై గుత్తాధిపత్యానికి మళ్ళీ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టె ‘మొగుళ్ళు’ మిగతా రెండు వర్గాలలోను మెండుగా ఉన్నారని గ్రహించడం మంచిది.
ఇక ప్రస్తుతం ‘బోర్డు సెలక్షన్’ తో నియమించబడిన కార్యవర్గాలు చట్ట విరుద్ధమని, అన్నికార్యక్రమాలు ఆపి 2023 ఎన్నికలు వెంటనే జరిపించాలని ‘తానా’ బోర్డుకి వచ్చిన లీగల్ డిమాండ్ నోటీసు అందిన వెంటనే షెడ్యూల్ చేసిన తానా బోర్డు మీటింగ్‌ని తానా న్యాయవాదితో సంప్రదించే వరకు ఆపాలని పాత బోర్డు చైర్మన్ అభిప్రాయపడుతూ మీటింగ్ కాన్సుల్ చేయగా, ఎంపిక అయి ప్రశ్నర్ధకంగా ఉన్న సభ్యులు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలని ప్రయత్నించడం పుండు మీద కారం జల్లినట్లే భావించవచ్చును.
ఇప్పటికైనా ఇప్పుడే మొదలైన న్యాయ వివాదం ఏ విధంగానైనా మారవచ్చని గ్రహించి స్థిమితంగా ఆలోచన చేసి మసలుకుంటే అందరికీ మంచిది.
అలాగే ఒక వేళ ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి నిజంగానే వస్తే ‘తానా’ సంస్థను తిరిగి గాడి లో పెట్టి అభ్యుదయం దిశగా నడిపే విధంగా మంచి నాయకుల మధ్య ‘పునరేకీరణ’ జరిగి స్థిరమైన కార్యవర్గాలు ఏర్పడాలని భావించడం అత్యాశ అంటారా?
ఏదేమైనా సంస్థలోని నాయుకులనుకునే వాళ్ళ పరిస్థితి ‘రంగ స్థలం’ సినిమాలో క్రింది పాట లాగా ఉందని ఒప్పుకుంటారని భావిస్తున్నాము
“హే రంగ రంగ రంగ స్థలంపై నా ..
కనపడని చెయ్యేదో ఆడిస్తున్న ఆట బొమ్మలం అంట..
ఇనపడని పాటకి సింధేస్తున్న తోలు బొమ్మలం అంట..
ఆట మొదలెట్టాక మధ్యలో ఆపలేని ఆట బొమ్మలం అంట..
మనమంతా తోలు బొమ్మలం అంట”..
Copy of Legal Demand Letter
August 10, 2023
Ildefonso Mas
Akerman LLP The Victor Building
750 9th Street, N.W., Suite 750
Washington, DC 20001
D: 202 824 1736
T: 202 393 6222
F: 202 393 5959
VIA EMAIL (B
Dr. Hanumaiah Bandla
Chairman of the Board of Directors Telugu Association of North America H [email protected]
Michael R. Sklaire Shareholder
Greenberg Traurig, LLP 1750 Tysons Boulevard
Suite 1000
McLean, VA 22102
RE: Telugu Association of North America
EMERGENCY DEMAND TO IMMEDIATELY CEASE AND DESIST FROM ULTRA VIRES ACTS, AND NOTICE OF, AND DEMAND TO PRESERVE
ALL RELEVANT DOCUMENTS AND COMMUNICATIONS
Dear Telugu Association of North America (“TANA”) Board Members, Dr. Hanumaiah Bandla, Chairman of the Board, and Mr. Sklaire:
Our firm represents Murali Thalluri, Sreedhar Chava, and Chakradhar Paruchuru, all of whom are TANA life members. Copied on this communication is my partner, Daniel Miktus. Please confirm that Mr. Sklaire is still legal counsel for TANA and its board of directors. If TANA has other counsel, please provide us with the contact information for any such legal counsel.
This letter is in advance of an ultra vires board meeting that will take place today with an unlawfully constituted board of directors. Conducting this meeting and further TANA business with an unlawfully constituted board and without honoring our clients’ rights to vote or run for office in TANA’s 2023 election would result in significant irreparable, imminent, and irreversible harm to our clients.
- TANA’s Board Has Violated Bylaws By Failing to Hold an Election
It has come to our attention that TANA’s board intends to proceed conducting TANA business today with a board that was unlawfully elected and/or appointed. Specifically, the current board was assembled without holding a lawful election as required by TANA bylaws and a recent court
akerman.com
order issued by the Circuit Court of Maryland for Baltimore City requiring TANA’s board to honor certain members’ voting rights for the 2023 election, presupposing that the election would take place. We note that Mr. Sklaire and his colleagues were involved in that litigation and therefore were aware of the Maryland Court’s order in that litigation. Instead of holding the election, in violation of the bylaws and the court order, that election never occurred. The board also failed to provide notice to all members that the election was unlawfully canceled. The board then improperly, on July 10, 2023, appointed members to TANA’s board without ever holding an election, as reflected in the attached Exhibit 1. Our clients and TANA members have been directly harmed as they have been deprived of their right to vote or run for office in the 2023 election, and they are now represented by a board that has been unlawfully assembled and appointed.
Specifically, TANA bylaws, Article XIV, Section 4(d), provides that “U nder no circumstances
shall any portion of the nominations and elections process or any appeals there from extend
beyond April 30 of the Conference Year, except with affirmative approval by at least two-thirds (2/3) of the total members of the Board of Directors (including those not in attendance).” At the time the election could have been held, the board never affirmatively approved, by a 2/3 majority, an extension of the election. The bylaws could not be more clear that “under no circumstances” can an election be delayed, or worse, canceled without a 2/3 majority vote of the board as has occurred here. The board, therefore had no authority to fill any claimed vacancy caused by its violation of TANA’s bylaws. For your reference, the bylaws are attached hereto as Exhibit 2.
In fact, in the meeting minutes available, the board acknowledged it violated the bylaw requirement to obtain a 2/3 majority: ” Whereas the TANA elections could not be held before April 30, 2023 due to a court imposed injunction, and whereas the Board could not get the required two thirds majority to extend the election deadline, the BOD resolves that the election schedule approved by the BOD at its meeting of January 30, 2023 is cancelled and that the Nominations and Elections Committee should return all the checks received with the nominations.”
There was simply no true “vacancy” in the board that the board could lawfully fill on July 10, 2023, because there was no election held to fill any vacancy. The board did not properly follow procedures in the bylaws which left some of the members not in good standing and thereby removed their eligibility to vote or run for office. This resulted in members of TANA needing to move for injunctive relief in Baltimore City Circuit Court to ensure that the member list for the 2023 election was properly created and procedures in the bylaws complied with. This resulted in the litigation and orders that delayed finalization of the member lists and the election. The Baltimore City Circuit Court’s order presupposed an election would be held, but the board never held the elections. Instead, the board unlawfully appointed members to positions which were absent because no election was held. See Ex. 1. This was unlawful and improper as there was no vacancy to fill.
Article VIII, Section 8(c) of the bylaws provides that:
For the purposes of this section, “vacancy” shall mean 1) the inability by the officeholder to fulfill the duties and functions of the office by reason of the officeholder’s resignation, removal, ongoing unexplained absence, death, or disability continuing beyond sixty (60) days or 2) that the position could not be
filled during the organizational elections specified in Article XIV. If any dispute arises concerning whether a vacancy exists in any office, the dispute shall be resolved by the Board of Directors. The decision of the Board of Directors shall be final.
No vacancy ever existed as an organizational election was unlawfully cancelled or indefinitely postponed, creating claimed “vacancies” that the board unlawfully filled. Holding a lawful election or lawfully postponing or canceling an election is a precondition and requirement before any true “vacancy” can exist under the bylaws.
The bylaws cannot be read to mean that a “vacancy” occurs when an election is canceled or postponed because of the Board’s violation of the bylaws and procedures to hold an election. If that were the case, it would render all of the election provisions meaningless because the Board could flout voting procedures, cause delays, and then postpone an election through violating the bylaws and never hold an election. It could instead simply ignore the requirements of the election by way of a violation of the bylaws and court actions, and then appoint its own members without ever holding a fair election as required under the bylaws.
In summary, because the organizational election for 2023 was never delayed or otherwise canceled by a 2/3 majority vote of the board, the board has violated and continues to violate the bylaws by conducting business without holding the election. There is no discretion in the bylaws which allows the board to unilaterally proclaim that an election need not be held, unless 2/3 of the board agrees to postpone the election. And the board may not simply refuse to hold an election, violate the bylaws, and then rely on other provisions to declare that the board may resolve disputes as to whether a vacancy exists or whether an election was properly held. Article XIV, Section 4(d) is clear that “under no circumstances” can the indefinite postponement, or worse cancelation, of an election take place, unless there is a 2/3 approval of the board to postpone an election. If the board can simply decide and resolve this dispute by majority, the words “under no circumstances” in Article XIV, Section 4(d) would be rendered meaningless, which is a result contrary to Maryland laws governing the interpretation of bylaws.
- Even if a Claimed Vacancy Did Exist, It Was Not Properly Filled Under the Bylaws
Additionally, even assuming an alleged “vacancy” ever existed, and it did not, the proper procedures for filling a vacancy were never followed. Article VIII, Section 8(b), provides:
If a vacancy occurs in any position on the Board of Directors, Executive Committee, or TANA Foundation other than President, then the Board of Directors, by a majority vote at any regular or special meeting of the Board called for that purpose at which a quorum is present, shall fill such vacancy within sixty (60) days with an eligible Life Member in good standing as defined in Article XIV, section
1.e. The Executive Committee shall propose the nominees for filling the vacancies in the Executive Committee. The Foundation shall propose the nominees for filling the vacancies in the Foundation. If the vacant position is that of a Foundation Donor Trustee, then the Board of Directors shall first seek to fill that position with a suitable Foundation Donor. If no suitable Foundation Donor can be found, then the
Board of Directors may fill the vacancy with any eligible Life Member subject to Article XIV, Section 8. If the vacant position is that of a TANA Donor Director, then the Board of Directors shall first seek to fill that position with a suitable TANA Donor. If no suitable TANA Donor can be found, then the Board of Directors may fill the vacancy with any eligible Life Member subject to Article XIV, Section 8.
None of these detailed procedures were followed as is clear from the face of the meeting minutes of the July 10, 2023, meeting in which board members were appointed without ever holding the 2023 election. Thus, the bylaws and a court order were violated by never holding the election, and even beyond that violation, the bylaws were again violated when claimed vacancies were filled without following the detailed procedures above in Article VIII, Section 8(b).
Also, at this July 10, 2023 meeting, only selective guests were invited in an arbitrary manner, with a last-minute room change for where the meeting was held, which further frustrated the ability of interested members to express their views in person at the meeting.
Conducting official business with an unlawfully constituted board will cause significant harm to TANA members, including our clients. The unlawful actions taken by the board would cause irreversible harm unless a court promptly enjoins the current, unlawfully constituted board from conducting further TANA business until an election is held to appoint a lawfully elected or constituted board. For example, Plaintiff Murali Thalluri was deprived of his consideration as a candidate for the board of directors as his candidacy was to be up for vote at the 2023 election. As further example, Sreedhar Chava was also deprived of an opportunity to run in the election for the position of Regional Representative of Northern California. The harm done has only amplified, as since the July 10, 2023, unlawful acts, on August 2, 2023, TANA’s Foundation team met on Friday, August 2, 2023, and elected the Foundation Chairman, Secretary, Treasurer, and Joint Treasurer. As per By-laws, the Foundation Chairman, Secretary, and Treasurer will become the Board Members. Thus, the unlawful appointment on July 10 has led to further unlawful appointments and actions, including but not limited to these appointments to the TANA Foundation.
DEMAND
In light of the bylaws, the court order described herein, and the violations of both by the TANA board, our clients respectfully demand the following:
- That the TANA Board promptly, as soon as possible under the bylaws, hold the 2023 election that was never held;
- That TANA preserve all documents and communications relevant to the matters discussed herein; and
- That the TANA Board cease and desist all other official board business until said election can be
If the demand is not satisfied by next Wednesday, August 16, 2023, we will promptly file suit for injunctive relief, and we reserve the right to seek fees and costs under applicable provisions of the bylaws.
This correspondence is being tendered without prejudice, and with a full reservation of our clients’, rights, all of which are expressly reserved herein.
Please govern yourselves accordingly.
Sincerely,
/s/ Ildefonso P. Mas
Ildefonso P. Mas
cc: Daniel Miktus, D [email protected]
తానా’ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ధ్రువీకరణ! – తారుమారు కాబోతున్న ఫలితాలు!!